సీఎం రేవంత్ రెడ్డి, మన కింగ్ నాగార్జున ఒకే టేబుల్ దగ్గర కూర్చోని కనిపించి ఆశ్చర్యపరిచారు. తెలంగాణ అందచందాలను, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే "మిస్ వరల్డ్ 2025" ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ప్రోగ్రాంలో ఈ అరుదైన దృశ్యం కంటపడింది. ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినా, అందరి కళ్లూ రేవంత్ రెడ్డి గారిపై, నాగార్జున గారిపైనే నిలిచాయి. ఎందుకంటే, వాళ్లిద్దరి మధ్య ఉన్న గొడవలు ఊరందరికీ తెలిసినవే.

అసలు నాగార్జునకి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, ఎన్-కన్వెన్షన్ సెంటర్ వ్యవహారం. అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత నాగార్జున అంతగా ఇష్టపడేది, తన రెండో ఇల్లులా చూసుకునేది ఈ ఎన్-కన్వెన్షన్ సెంటర్‌నే.

కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, హైదరాబాద్ అధికారులు దాన్ని కూల్చివేశారు. నాగార్జున కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దారిలో వెళ్లే ఎవరికైనా, అక్కడొకప్పుడు ఓ అద్భుతమైన నిర్మాణం ఉండేదని గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇది నాగార్జునకి కేవలం డబ్బుల విషయం కాదు, ఆయన కలలు కళ్లముందే కూలిపోయినట్టు అయ్యింది.

ఇక రెండో గొడవ ఇంకాస్త పర్సనల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి (కొండా సురేఖ) నాగార్జునపై చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు, అదీ ఒక మహిళ అయి ఉండి అలా మాట్లాడటం సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో నాగార్జునమంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అంటే, ఒకవైపు ఆస్తికి సంబంధించిన గొడవ, మరోవైపు పరువుకు సంబంధించిన కేసు... ఇలా రెండు రకాలుగా నాగార్జున గారు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఇన్ని విభేదాలున్నా, నాగార్జున చాలా హుందాగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డితో కలిసి ఈవెంట్‌లో పాల్గొనడమే కాకుండా, ఆయన పక్కనే కూర్చున్నారు. నిజానికి, ఇలా కలవడం ఇదే మొదటిసారేం కాదు. ఇంతకుముందు కూడా టాలీవుడ్ ప్రముఖులు రేవంత్ రెడ్డితో భేటీ అయినప్పుడు నాగార్జున కనిపించారు. కానీ, ఈసారి ఏకంగా ఒకే టేబుల్ దగ్గర, పక్కపక్కనే కూర్చోవడం మాత్రం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది, అదే ఆయనలోని సంయమనం, ఓర్పు.y

ఎంత పెద్ద గొడవలున్నా, మనుషులు హుందాగా ఒకేచోట ఉండొచ్చని, పబ్లిక్‌గా నాగరికంగా ప్రవర్తించవచ్చని ఈ సంఘటన నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: