9 ఏళ్ల వయసులో బాలుడుగా తప్పిపోయి గూగుల్ మ్యాప్ సాయంతో 38 ఏళ్ల వయసులో ఇంటికి చేరాడు ఒక వ్యక్తి. 29 ఏళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత కన్నవారి చెంతకు చేరిన ఈ ఘటన హర్యానాలోని అంబాలా లో జరిగింది. తొమ్మిది ఏళ్ళ వయసులో సంజయ్ అనే 9 ఏళ్ల యువకుడు రైల్వే స్టేషన్లో సరదాగా ఆడుకుంటూ రైలు ఎక్కి నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర మేల్కొని చూసేసరికి రైలు ఉత్తరప్రదేశ్లోని అగ్రలో ఉంది. ఇంటి చిరునామా గుర్తుకురాని సంజయ్ ఎటు వెళ్లలేక అక్కడే ఉండిపోయాడు. అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళదీశాడు. ఆగ్రా నుంచి మీర‌ట్ కు అక్కడ నుంచి రిషికేష్ కు మారాడు. 2009లో రాధిక అనే మహిళను పెళ్లాడి ముగ్గురు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు.


తన గతం గుర్తుకు తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడిన సంజయ్ కు సడన్గా ఒక రోజు అంబాలాలోని తన ఇంటి దగ్గర ఒక పోలీస్ పోస్టు .. దాని ముందు ఒక దర్గా ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. వెంటనే గూగుల్ మ్యాప్లో సాయంతో తన ఇంటిని గుర్తించాడు. 29 ఏళ్ల తర్వాత తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన సంజ‌య్ ను చూసి తల్లి వీణ ఉప్పొంగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తన కుమారుడు తిరిగి ఇంటికి వస్తాడని తాము అసలు ఊహించలేదని .. ఎంతో భావోద్వేగానికి గురైంది. సంజయ్ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేసి.. చాలా చోట్ల వెతికినట్టు ఆమె తెలిపారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: