
బీఆర్ఎస్ పై నిందలు , బిల్డర్లు , కాంట్రాక్టర్ల తో దందాలు ..
ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు ..
ఈడీ చార్జీషీటులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం రాష్ట్రాని కి అవమానం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరీంగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావటం పై గట్టి విమర్శలు గుప్పించారు .. రేవంత్ రెడ్డి కేవలం మాటల ముఖ్యమంత్రి కాదు మూటల ముఖ్యమంత్రి అంటూ ఆయన పై విమర్శలు గుప్పించారు .. మూటలు మోసే పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నార ని విమర్శలు చేశారు .. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ అనే బీరుదు వచ్చిందని కూడా అన్నారు ..
అలాగే తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు . మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల కు నాయకత్వం వహించే పదవులు ఉన్న రేవంత్ రెడ్డి కి నిజాయితీ , నైతికత ఉంటే వెంటనే సీఎం పదవి కి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు .. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డి తో రాజీనామా చేయించి ఈ కేసు లో ఎలాంటి నిష్పక్షపాతం గా విచారణ జరిపించాల ని కూడా ఆయన డిమాండ్ చేశారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు