వివాహ జీవితం అనేది ఇద్దరి మధ్య పరస్పర బంధానికి నిదర్శనంగా నిలవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, అండ, అనురాగం అనేవి ఒకరినొకరు బలంగా కట్టిపడేసే మూలస్తంభాలుగా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అనురాగానికి లోటుపడే జంటలు కనిపిస్తుంటారు. ముఖ్యంగా భర్తల నుంచి తగినంత ప్రేమ, అటెన్షన్ లభించకపోవడంతో కొంతమంది మహిళలు లోనిపడతారు. అటువంటి వారికోసం సింగపూర్‌ లో ఓ ప్రత్యేకమైన స్పా సెంటర్ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ స్పా అందించే ట్రీట్మెంట్లు సాధారణమైనవే కాకుండా, మానసిక ఆత్మశాంతిని కలిగించేలా ఉంటాయి. ముఖ్యంగా మేల్ కేర్ లేక బాధపడే మహిళలకు ఇది పెద్ద ఊరటనిస్తోంది. ఈ స్పాలో రొమాంటిక్ వాతావరణం క్రియేట్ చేసి, వారికి మానసికంగా రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. భర్తల నుంచి అందని ప్రేమ, అనురాగాన్ని లాంటి వాటిని అందించేందుకు ప్రత్యేకమైన సర్వీసులు ఇక్కడ ఉన్నాయి.

స్పాలో మేల్ అటెండెంట్స్ మహిళలతో స్నేహంగా, శ్రద్ధగా, చాలా కేర్‌తో మెలుగుతారు. కాఫీ తాగించడం, తిండి తినిపించడం, మృదువుగా మాట్లాడటం, వారి మాటలు వినడం, మసాజ్ చేయడం, కాళ్లు నొక్కడం వంటి సేవలు అందిస్తారు. వీరి ప్రవర్తన పూర్తిగా వారి సేవలపై కేంద్రీకృతమై ఉంటుంది. కానీ, ఇది శారీరక సంబంధం కాకుండా భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. ఈ స్పా ప్రత్యేకత సెక్స్‌వల్ ఎలిమెంట్‌కు దూరంగా ఉండి, మహిళలకు ఎమోషనల్ కేర్ అందించడమే. శృంగారం కంటే ఎక్కువ రొమాన్స్ అనే భావనతో, బాధపడే మహిళలకు ఇది కొత్త అనుభూతిని ఇస్తోంది. జీవితంలో ఒక కొత్త పీక్స్‌ ఫుల్ అనుభూతిని పొందే అవకాశం కలుగుతోంది.

ఈ స్పా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు దీన్ని ప్రశంసిస్తూ, భర్తల నుంచి అవసరమైన ప్రేమ లేకపోతే ఇలాంటి ప్లేస్ ఓ మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కొందరు అయితే ఇది మహిళలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే నూతన దారిగా చెప్పడం గమనార్హం. భార్యాభర్తల జీవితం ప్రేమతో నిండి ఉండాలని అందరూ కోరుకుంటారు. కాని కొందరిలో అది సాధ్యపడకపోతే, మానసిక సమతుల్యత కోల్పోతారు. అలాంటి సమయంలో ఇలాంటి స్పా సర్వీసులు ఓ రిఫ్రెష్‌గా మారి, వారికి కొత్త దారి చూపిస్తున్నాయి. నిజమైన అనురాగానికి రూపం కలిగించే ఈ కాన్సెప్ట్ పట్ల ఇప్పటిదాకా అనేక చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: