జూన్ 2 ని తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటారు.ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ కూడా ఉండేది.కానీ ఆ తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ వేరుపడి చివరికి 2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. అలా అప్పటినుండి జూన్ 2 ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు.అయితే తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుండి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఆ తర్వాత మూడోసారి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగాక బీఆర్ఎస్ పార్టీలోని చాలామంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

ఇక ఈ మధ్యకాలంలో కవిత కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొత్త పార్టీ పెట్టే దిశలో కనిపిస్తోంది.అయితే తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కవిత చేసిన పనికి చాలామంది షాక్ అయిపోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందే జాగృతి పార్టీ ఆఫీస్ ని కొత్తగా ఓపెన్ చేసిన కవిత తాజాగా రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొంది. ఇందులో కవిత వేసుకున్న కండువా కూడా మార్చుకుంది. అంతకుముందు గులాబీ రంగు కండువా ధరించిన కవిత తాజాగా గులాబీ రంగు కండువాను ధరించకుండా జాగృతి అని ఉన్న కండువాని మెడలో వేసుకుంది.అలాగే ఆ కండువా పై కేసీఆర్ ఫోటో కూడా లేదు. దీంతో కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది 

అలాగే ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో కవిత జై తెలంగాణ.. జై జాగృతి.. జై కేసీఆర్..అని చెప్పింది కానీ జై బీఆర్ఎస్ అని ఒక్కసారి కూడా తన నోటి నుండి పలకలేదు.దీంతో డౌటే లేదు కవిత వేరే పార్టీ పెట్టడానికి ముహూర్తం కూడా చూసుకుంటుంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అవతరణ రోజు కవిత చేసిన పని రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.మరి ఇంకా కవిత ముందు ముందు ఏం చేస్తుంది..ఆమె కొత్తదారి ఎంచుకుంటుందా..లేక తండ్రి మాటకు విలువిచ్చి బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: