
దీనికి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి సంఖ్యను కూడా కేటాయింపు ఇచ్చింది. తర్వాత జగన్ పాలనలో ఈ ప్రాజెక్టు కాస్త వెనకబడిపోయింది. దీని తర్వాత కేంద్రం అనంతపూర్ నుంచి గుంటూరు వరకు 398కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయ రహదారిని 544డి విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో 208 కిలోమీటర్లు నాలుగు వరసలు మధ్యలో 110 కిలోమీటర్లు మాత్రమే రెండు వరుసలుగా వదిలేశారు. రెండు వరసలు ఎందుకని ప్రశ్నిస్తే కొన్ని సాంకేతిక కారణాలు చూపి అలాగే విడిచిపెట్టారు.
నాలుగు వరుస లైన్ పూర్తి కావాలి:
ఇందులో అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్లు 4వరుసల లైన్ ఉంది. అలాగే బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కిలోమీటర్లు నాలుగు వరుసల లైన్ వేశారు. అలాగే గిద్దలూరు నుంచి వినుకొండ వరకు 110 కిలోమీటర్లు రెండు వరుసల లైన్ వేసి వదిలేశారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.8కిమీ నాలుగు వరుసల లైన్ వేశారు. గిద్దలూరు నుంచి వినుకొండ వరకు రెండు వరుసల లైన్ వేయడం వల్ల దాన్ని కూడా నాలుగు వరుసలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రజలు అంటున్నారు. అనంతపురం నుంచి అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కళా సాకారం కాలేదని, భావిస్తున్న అనంతపురం గుంటూరు హైవే మొత్తం నాలుగు వరసలతో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పూర్తిగా నాలుగు వరుసల లైన్ వేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అంటున్నారు.