
అయినా సరే విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగ సభలో మోదీ పవన్ కళ్యాణ్ సరిగ్గా పట్టించుకోలేదు అని చంద్రబాబు నాయుడు - పవన్ కళ్యాణ్ ని వెనక్కి నెట్టేస్తూ తన కొడుకు లోకేష్ ని ముందుకు తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తున్నాడు అని రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ పదే పదే లోకేష్ పేరు ప్రస్తావించడం దీనికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. తాజాగా జరిగిన విశాఖ యోగ సభలో మాత్రం పవన్ కంటే లోకేష్ కు ప్రియారిటీ ఎక్కువ దక్కింది అని ప్రచారం చేస్తున్నారు .
అంతర్జాతీయ యోగా సభ లాంటి భారీ ఈవెంట్ లోకేష్ లేకపోతే జరిగి ఉండదు అనే విధంగా టిడిపి తమ్ముళ్లు మాట్లాడుకోవడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు కేంద్రంలో కీలకంగా ఉన్న బిజెపి పెద్దలు కూడా లోకేష్ మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న సంకేతం ఈ సభ ద్వారానే తెలిసిపోయింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఎప్పుడైనా ఏ ఈవెంట్ అయినా పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ పవన్ హైలెట్ అవుతాడు . కానీ ఈసారి యోగ సభలో మాత్రం పవన్ యోగ డే కి వచ్చారా వెళ్లారా అన్నట్టుగానే సాగింది .
కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ హైలెట్ చేయలేదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే పవన్ ని అసలు పట్టించుకోలేదు . లోకేష్ లోకేష్ లోకేష్ అంటూ అంతా లోకేష్ మయమే చేసేసారు . క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోనే వేసేసారు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . దీంతో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ కి భారీ బ్రేక్ పడబోతుంది అన్న కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనితో పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ ని తొక్కేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో కుట్ర జరుగుతుంది అన్న చర్చ తెరపైకి వచ్చింది .
పవన్ కళ్యాణ్ త్వరగా మేలుకోకపోతే పరిస్థితి పూర్తిగా చేజారి పోతుందని .. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలు చేసుకొని బ్రతకాల్సి వస్తుంది అని కొంతమంది ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . అయితే మరొక పక్క టిడిపి సభ్యులు టిడిపి ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు. టిడిపి జనసేన ఎప్పుడు కలిసే ఉంటుంది అని .. ఎప్పుడు కలిసి పోటీ చేసి విన్ అవుతుంది అని ఇలాంటి పుల్లలు పెట్టడానికి వేరే వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు అంటూ అలాంటివని నమ్మద్దు అంటూ చెప్పుకొస్తుంది. కొంతమంది జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ని యోగ సభలో తక్కువ చేశారు అన్న కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. కేవలం ఇది జస్ట్ యోగ వరకేనా లేక ముందు ముందు ఇలాగే సాగుతుందా..? అన్నదే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు . చూడాలి టాలెంటెడ్ పవన్ కళ్యాణ్ ఎలా తన పదవిని కాపాడుకుంటాడో..?? ఎలా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తాడో..??