- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

వ‌చ్చే యేడాది జ‌రిగే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం గా నిర్వ‌హించాల‌ని ఏపీ లోని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మం లో నే చ‌రిత్ర‌లో నే క‌నివినీ ఎరుగ‌ని రీతిలో పుష్క‌రాల‌ను నిర్వ‌హించాల‌ని .. ఇందుకోసం ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్ర‌ణాళిక తో ఏర్పాట్ల‌కు రెడీ అవుతోంది. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా కూట‌మి ప్ర‌భుత్వానికి ఉండ‌నుంది. ఈ క్ర‌మంలో నే కేంద్రం సైతం నిధులు భారీగా ఇస్తోంది. పైగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీగా కేంద్ర మాజీ మంత్రి .. బీజేపీ ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప్రాథినిత్యం వ‌హిస్తుండ‌డం కూడా అక్క‌డ ప్లస్ కానుంది.


ఇక తాజాగా రాజమహేంద్రవరం పర్యటన పూర్తి చేసుకొని అమరావతికి చేరుకున్న కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాష్ట్ర విద్యా, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం లో జరిగిన అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ₹ 94.44 కోట్ల తో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తన పాదయాత్ర "యువగళం" విశేషాల తో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు బహూకరించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: