
గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కనిపించిన అభివృద్ధికి కూడా ఈయనే ముఖ్య కారణమంటూ తెలిపారు బాబా రాందేవ్. రాష్ట్రంలో పతాంజలి సంస్థలు పెట్టుబడిల గురించి కూడా మాట్లాడారని మేము ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాము.. ఇది మా లాభం కోసం కాదు భారతదేశ అభివృద్ధి కోసమే ఇందులో భాగమవుతున్నామంటూ తెలిపారు బాబా రాందేవ్. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కోసమే కృషి చేస్తామని త్వరలోనే హార్లీ హిల్స్ ఐకానిక్ వెల్సన్ సెంటర్ ని కూడా స్థాపిస్తామంటూ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యటన పైన కూడా గుర్తింపు పొందేలా చేస్తామంటూ బాబా రాందేవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటనకి చాలా అవసరమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించామని అందుకే సీఎం చంద్రబాబు న్యాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా త్వరలోనే మారేందుకు అవకాశం ఉన్నదని రామ్ దేవ్ బాబా తెలియజేశారు. ఈ సందర్భంగా టూరిజం రంగంలో కూడా కొనసాగుతున్న ఉత్సవాలను కూడా ప్రశంసించడం జరిగింది బాబా రాందేవ్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ పర్యటన రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా తాను ఉండడానికి సిద్ధంగానే ఉన్నానన్నట్లుగా తెలియజేశారు బాబా రాందేవ్.