
కష్టపడిన కార్యకర్తలను మరువద్దని మిమ్మల్నందరినీ కోరుతున్నా అని ... పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తాం... అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి, జులై 5 నాటికి కమిటీలన్నింటిని పూర్తిచేయాలి ... సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందని... సీనియర్లే నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు... సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి... ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి అని తెలిపారు. ఇక నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరం డోర్ టూ డోర్ ప్రచారం చేసి సుపరిపాలనలో తొలి అడుగు- ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు