మంచి ప్రభుత్వం అనే పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరకు వెళుతున్న వేళ.. సొంత పార్టీ నేతలు తెచ్చిన వివాదంతో నంద్యాల ప్రాంతంలో జరిగిన వివాదంతో చాలా గందరగోళంగా మారిపోయింది. నంద్యాల మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఏమో ఎంపీ శబరితో సన్నిహిత్యంతో వాళ్ళు కలిసి చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే రాజశేఖర్ ను పట్టించుకోవడం లేదు ఎంపీ శబరి. రాజశేఖర్ రెడ్డి  వచ్చేసరికి శబరిని పట్టించుకోవట్లేదు.. శబరి రాజశేఖర్ ని పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే వాళ్ళిద్దరి మధ్య వివాదం ముదిరింది.


తాజాగా బుడ్డ రాజశేఖర్ రెడ్డికి చెప్పకుండా శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరులో ఒక కార్యక్రమానికి  ఏరాసు ప్రతాపరెడ్డిని తీసుకొని ఎంపీ శబరి వెళ్లారు.. దీంతో ఎంపీ గో బ్యాక్ అంటూ పలు రకాల నినాదాలు చేశారు ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఎంపీ శబరి వెంట మాజీ మంత్రి అయిన ప్రతాపరెడ్డి పర్యటించకూడదంటూ అక్కడ కొంతమంది ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అనుచరులు వ్యతిరేకించారు.. ఏరాసు ప్రతాపరెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే వేళ్లెందుకు ప్రయత్నం చేశారని..ఏరాసు ప్రతాపరెడ్డి పైన కూడా దాడి చేశారట ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు. శ్రీశైలంలో  జరిగినటువంటి ఈ సంఘటన సంచలనంగా మారింది. దీంతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపైన అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి ప్రతాపరెడ్డి తెలియజేశారు. ఈ విషయాన్ని టిడిపి పార్టీ ఇన్చార్జి పయ్యావుల కేశవ్, అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారట.


గతంలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి తీరుపైన కూడా చాలా మంది పార్టీ పెద్దలు ఫైర్ అయ్యారు. అయినా కూడా ఆయన తీరు మార్చుకోలేదని కొంతమంది నేతలు మండిపడుతున్నారు. ఈ ఇష్యూ కారణంగా చూసుకుంటే నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలోని రాజకీయాలు మరింత హీటెక్కించేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా అక్కడ జరిగే ఎటువంటి అభివృద్ధి పైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య కూడా ఒక వార్ నడుస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లో అధిష్టానానికి ఈ నేతలు తలనొప్పిగా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: