యెమెన్ జాతియుడిని హత్య చేసిన కేసులో ప్రముఖ భారతీయ నర్సు నిమిషా ప్రియా కు ఉరిశిక్ష వేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమిషా ను ఈనెల 16వ తేదీన ఉరిశిక్ష వేయాలంటు యెమెన్ అధ్యక్షుడు కూడా తెలియజేశారు. మరి కేరళ ప్రాంతానికి చెందిన ఈ నర్సుకి ఎందుకు ఉరిశిక్ష వేశారు అనే విషయంపై ఇప్పుడు పూర్తిగా చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే కేరళలోని పాలక్కడ్ చెందిన నర్స్ నిమిషా ప్రియా 2008లో యెమెన్ వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసిందట. అయితే అనంతరం 2015 లో ఆమె అక్కడ ఒక సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని  ప్లాన్ చేసింది.యెమెన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలి అంటే అక్కడ ప్రాంతంలో ఉండే వారితో భాగస్వామ్యం ఉండాల్సిందేనట. దీంతో ఆమె యెమెన్ దేశస్తుడైన తలాలు అద్దో మహమ్మదీతో కలిసి క్లినిక్ ని ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయట.2016 లో మహాదీపైన నిమిషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి మరి జైలుకు పంపించారు.


అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత  నిమిషా పైనా ఎక్కువగా వేధింపులకు గురి చేసేవారట.. ఆమె పాస్పోర్టును తిరిగి ఇవ్వకుండా బెదిరించడంతో ఆమె ఎలాగైనా ఆ పాస్పోర్ట్ తిరిగి సంపాదించుకోవాలని ప్లాన్ చేసి మరొక వ్యక్తితో కలిసి మహాదీకి మత్తుమందు ఇప్పించింది. అయితే ఈ మందు ఓవర్ డోస్ కావడం చేత మహాదీవ్ మరణించారు. నిమిషా అతనికి సహాయం చేసిన మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు 2018లో ప్రియాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు యెమెన్ కోర్టు. యెమెన్ అధ్యక్షుడు రషద్ ఆల్ అలియా కూడా ఆమెకు ఉరిశిక్ష వేయాలని తెలిపారు.. అయితే ఈ ఉరిశిక్ష రద్దు కోసం ప్రియా ఫ్యామిలీ చాలా పోరాటం చేయగా అవేవీ ఫలించలేదు. భారత ప్రభుత్వం కూడా ప్రియా మరణశిక్ష పైన స్పందించి ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం మాత్రమే చేయగలమని తెలిపారు.


నిమిషా ఉన్న ఏకైక ఆప్షన్ ఏమిటంటే ఆ బాధితుడు యొక్క కుటుంబానికి.. బ్లడ్ మనీ విధానం ద్వారా ఆ బాదుతుడి యొక్క కుటుంబ నష్టపరిహారం తీసుకొని ఆమెకు క్షమాబిచ్చా  ప్రసాదించవచ్చట.. అందుకు సంబంధించి ప్రియా తల్లిదండ్రులు కూడా లాయర్లతో ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ప్రియ ఉరిశిక్షకు తేదీ కలర్ అవడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: