
రీసెంట్ గానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషను పెద్దమ్మ అంటూ సంబోధించి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యాడు . అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి లోకేష్ హిందీ భాషకు మద్దతు తెలపడంతో ఈ వివాదం మరింత హైలెట్గా మారింది. తాజాగా ఓ నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. నారా లోకేష్ హిందీ మన జాతీయ భాష అంటూ నోరు జారారు. ఒకవైపు యాంకర్ జాతీయ భాష హిందీ కాదు అంటూ చెప్తూ ఉన్నా కూడా నారా లోకేష్ వెంటనే దాన్ని ఖండించి కాదు కాదు హిందీ జాతీయ భాష అని గట్టిగా నొక్కి చెప్పాడు .
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇంకేముంది ఎప్పుడెప్పుడు లోకేష్ దొరుకుతాడో అని వెయిట్ చేసిన జనాలు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . లోకేష్ కి గట్టిగా క్లాసులు పీకుతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీ అధికార భాషలో ఒకటి మాత్రమే లోకేష్ గారు .. అది జాతీయ భాష కానేకాదు . ఇప్పటివరకు ఎవరు ప్రకటించబడలేదు . దేశంలో 22 అధికార భాషలు ఉండగా రాజ్యాంగంలో ఏ భాషకు కూడా జాతీయ భాష హోదా ఇవ్వలేదు. ఆ మాత్రం మీకు తెలియదా ..?? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు తప్పు మాట్లాడడమే కాక ఆ యాంకర్ సరిచేస్తున్న కూడా వినట్లేదు నువ్వు మినిస్టర్ వా..? అంటూ కొందరు ..నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నా లోకేష్ అన్నా ఏంటి..? అంటూ మరి కొందరు లోఖేష్ ని వెటకారంగా వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో లోకేష్ మాట్లాడిన వీడియో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి అవుతుంది. అందరు లోకేష్ ని పప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!