ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించి కోర్టులు ఇస్తున్న తీర్పుల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. విడాకుల అంశానికి సంబంధించి బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అవమానించడం కౄరత్వంతో సమానమని స్పష్టం చేసింది.

విడాకులు పొందడానికి వీటిని   కారణాలుగా పేర్కొనవచ్చని కోర్టు వెల్లడించింది.  ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులు సవాల్ చేస్తూ  ఒక మహిళ కోర్టును ఆశ్రయించగా  హైకోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది.  తనకు నెలకు  లక్ష రూపాయల భరణం కావాలని మహిళ కోరగా  తోటి ఉద్యోగుల ముందు,  భర్త స్నేహితుల ముందు ఆమె ప్రవర్తించిన తీరు  దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని హైకోర్టు తెలిపింది.

దివ్యంగురాలైన భర్త సోదరి,  ఆయన కుటుంబ సభ్యుల మధ్య  ఉదాసీనత చూపించడం కూడా  అతని  బాధకు  కారణాలుగా పేర్కొంది.  2013 సంవత్సరంలో ఈ జంట వివాహం జరగగా  పెళ్ళైన  ఏడాది తర్వాత నుండి ఈ జంట విడిగా ఉంటోంది.  భర్తతో శృంగారానికి నో చెప్పడంతో పాటు  భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని భార్య తరచూ అనుమానిస్తూ ఉండేది.

స్నేహితులు, ఉద్యోగుల ముందు అవమానిస్తూ మానసిక వేదనకు గురి చేస్తోందని  పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి భార్య తనను ఏ మాత్రం  పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.  భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త  విడాకులు కోరుతూ 2015లో  పూణే కోర్టును ఆశ్రయించారు.  న్యాయస్థానం  విచారణ జరిపి విడాకులకు అనుమతులు ఇచ్చింది.  ఆ తీర్పును సవాల్ చేస్తూ మహిళ కోర్టును ఆశ్రయించగా  అందుకు భిన్నంగా జరిగింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: