
బాలికను ఎవరు చంపారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. అమ్మాయి లివర్ డామేజ్ అయిందని ఆమె శరీరంపై కమిలిన గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ హత్య కేసులో చిక్కుముడులు అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బాలిక తల్లిదండ్రులు మాత్రం బాలిక సోదరుడే హత్య చేశాడని జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
సొంత చెల్లిని ఎవరైనా వివస్త్రను చేసి హత్య చేస్తారా అంటూ బాలిక తల్లిదండ్రులు ఈ విమర్శల గురించి స్పందించారు. ఈ కేసును ఛేదించడం కోసం స్వయంగా ఎస్పీ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇంటర్ చదువుతున్న బాలిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేక బృందాల సహాయంతో బాలిక హత్య కేసు మిస్టరీని చేధించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఈ కేసులో ఇప్పటికే 60 మంది అనుమానితులను పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. ఈ హత్య పరువు హత్యనా? లేక బాలిక మృతికి మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. బాలిక తల్లి మాత్రం బాలిక లవర్ అయిన లోకేష్ ను ఎన్ కౌంటర్ చేయాలని కోరుతున్నారు. కొన్ని చానెళ్లు మాపై అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికపై హత్యాచారం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే త్వరలో ఈ కేసులో అసలు నిజాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.