
ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సమస్యలతో పాటు, వయస్సుతో సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉండటంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయనకు అవసరమైన అన్ని మెడికల్ ఫెసిలిటీలు అందిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. కుటుంబ కలహం మధ్య పరామర్శ.. ముద్రగడ ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలియగానే ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఆసుపత్రికి వచ్చి తన తండ్రిని పరామర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా ముద్రగద మరియు క్రాంతి మధ్య వ్యక్తిగత, ఆస్తి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నాయని వార్తలున్నప్పటికీ, ఆమె తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి చేరారు.
అయితే క్రాంతి హాస్పిటల్‌కు రాగానే ముద్రగద గిరి (ముద్రగద కుమారుడు) ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఎవరికైనా ముద్రగద పడక గదికి వెళ్లే అవకాశం ఇవ్వొద్దని ముందుగా చెప్పామని, అయినా క్రాంతిని పంపించడాన్ని తప్పుపట్టారు. దీంతో ఆసుపత్రిలో స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. క్రాంతి మాత్రం తాను రాజకీయంగా ఉన్నా, కుటుంబ విషయాల్లో తండ్రి ఆరోగ్యం విషయంలో స్పందించడంలో తప్పేమీ లేదని స్పష్టంచేశారు. తండ్రి ఆరోగ్యం విషయంలో ఆలోచించాల్సింది తమందరిమీదే కానీ, ఇలా బాహ్యంగా వ్యవహరించడం సరిగ్గా కాదని ఆమె అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితి .. ప్రస్తుతం ముద్రగద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తాజా బులిటెన్‌లో తెలిపారు. ఇంకా 24 నుంచి 48 గంటలు గమనించాలని చెప్పారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ముద్రగదకు ఉన్న గౌరవం దృష్టిలో పెట్టుకుని పలువురు నేతలు, అభిమానులు ఆయన ఆరోగ్యం కోసమే ఆసుపత్రికి ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
సామాజిక, రాజకీయ క్రమశిక్షణకు నిలువెత్తు ఉదాహరణ .. ముద్రగద పద్మనాభం కాపు సామాజిక ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా, రాజకీయాల్లోనూ సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా పేరుగాంచారు. ఆయన ఆరోగ్యం విషయంలో అనూహ్య పరిస్థితి నెలకొనడం, కుటుంబ విభేదాలు అదే సమయంలో బయటపడటంతో, ఈ అంశం పట్ల రాజకీయంగా, సామాజికంగా చర్చలు మొదలైయి. ఒకవేళ పరిస్థితి మరింత దారుణంగా మారితే... ముద్రగద రాజకీయ ప్రయాణానికి ముగింపు చిహ్నం పడుతుందా? లేదా కుటుంబం గాయాల్ని తగ్గించుకొని సమష్టిగా ముందుకెళుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి!