
మానవత్వం లేని వ్యక్తి పార్టీని నడపడం విడ్డురంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని మళ్ళి జగన్ అధికారంలోకి రాడని భరోసా కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 16000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని అన్నక్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం అందించడం ద్వారా మంచి ప్రభుత్వం అని పేరు తెచుకున్నామని వైసీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి విచారణ లేకుండా తీసుకెళ్లి లోపలేస్తాం అని పెద్దిరెడ్డి చెబుతున్నారని ఆయన తెలిపారు వైసీపీ నేతలు తమ కక్షలు, పగలు తీర్చుకోవడానికి ప్రజలను వేధించడానికి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని నిమ్మల అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
రాయలసీమలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చూసినా ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తొచ్చారని నిమ్మల పేర్కొన్నారు. హంద్రీ నీవాకు చివరన ఉన్న ఆదివిపల్లి రిజర్వాయర్ కు నీటిని తీసుకొస్తామని నీవా బ్రాంచ్ ద్వారా కళ్యాణి డ్యామ్ నింపి తిరుపతికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. జగన్ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో కక్షలు ఉండవని తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని నిమ్మల అన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు