
తాజాగా సోదాలు ఏవైతే జరిగాయో భారతీ సిమెంట్ కి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా తీసుకువెళ్లి చూపించడం లాంటిది జరిగిందట. ఇదే అక్కడ కీ పాయింట్. అయితే ఇక్కడ రెండు కోణాలు.. ఒకటి ప్రతిపక్షంగా తమని వేధిస్తున్నారంటూ గవర్నర్ కి కంప్లైంట్ చేయడం. ఇది రొటీన్ ప్రాసెస్.. కానీ మరొకటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకెళ్లగలిగిన మీడియేటరే ఇప్పుడు గవర్నర్. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు తృ-గవర్నర్ ద్వారానే తీసుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతలను టార్గెట్ చేసుకొని ప్రభుత్వం వారి పైన తప్పుడు కేసులు నమోదు చేస్తోందనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారని మాజీ సీఎం తెలుస్తోంది. గవర్నర్ అపాయింట్మెంట్ లభించడంతో తాడేపల్లి కి వచ్చి ప్రభుత్వం తమ నేతల పైన నమోదు చేస్తున్న కేసులతో పాటు జిల్లాల పర్యటనలు విధిస్తున్న ఆంక్షలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా గవర్నర్ ముందు పెట్టినట్టుగా వినిపిస్తున్నాయి. అనంతరం ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారట. అలాగే ఈ నెల 31న నెల్లూరుకి వెళ్లి మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఆ తర్వాత వచ్చే నెల 5వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారట. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రామర్శించడానికి వెళ్ళబోతున్నట్లు వినిపిస్తున్నాయి.