ఏపీలో రాజకీయాలు  చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా టిడిపి,వైసిపి మధ్య ప్రధాన పోటీ ఉండేది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేన పార్టీ స్థాపించారో అప్పటినుంచి  వైసిపి కి మరో ప్రత్యర్థి తయారైంది. అలా ఈ మూడు పార్టీలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి పొజిషన్ లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టిడిపి జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టిడిపి కూటమి కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడో ఆ విధంగానే  చేస్తోంది. జగన్ కు టిడిపికి తేడా లేకుండా పోతుంది.. ముఖ్యంగా పాలిటిక్స్ అనేవి చాలా ఒద్దికతో కూడి ఉండాలి. అహంకారం అసలే ఉండకూడదు.. గతంలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించినప్పుడు, మళ్లీ ఈ ఎలక్షన్స్ లో వై నాట్ 175  అంటూ ప్రచారం చేసుకున్నాడు.

 ఇప్పటికే రెండున్నర కోట్ల మందికి బెనిఫిట్స్ అందజేశామని తప్పకుండా మేమే అధికారంలోకి వస్తామని మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏ ప్రభుత్వం కూడా చేయలేదంటూ  ప్రతిదీ హైలెట్ చేసి చెప్పుకున్నాడు.. అయితే దీనిపై ప్రతిపక్ష నాయకులైన టిడిపి కూటమి వారు ఎవడబ్బ సొమ్మని ఇచ్చాడు..ఆయన జేబులో నుంచి ఇచ్చాడా.. ప్రజల సొమ్మే కదా అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఆ నినాదం పైనే అధికారంలోకి వచ్చినటువంటి టిడిపి కూటమి జగన్ ఏ విధంగా అయితే అహంకార ధోరణితో మాట్లాడారు వారు కూడా మరో 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం, జగన్ ని అసలు రానివ్వమంటూ మాట్లాడుతున్నారు.. అలా జగన్ మాట్లాడి ఈసారి 11 సీట్లకు పరిమితం అయ్యాడు..

ఒకవేళ జగన్ అయ్యా నేను రాష్ట్రాన్ని కొంతవరకు డెవలప్ చేశాను.. ఇంకా డెవలప్ చేసేది ఉంది.మరోసారి ఛాన్స్ ఇవ్వండి.. అని అడిగి ఉంటే ఆయన ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉండేవాడు కావచ్చు. అలా కాకుండా చాలా అహంకార ధోరణితో  175 కి 175 నేనే గెలుస్తాను..నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదంటూ మాట్లాడారు.. చివరికి ఓడిపోయి కూర్చున్నాడు.. కట్ చేస్తే ప్రస్తుతం టిడిపి కూటమి వారు కూడా  ఆ తోవలనే వెళ్తున్నారు. ఆనాడు ఈ మాటలను   జగన్ అంటేనేమో అహంకారమైంది..ఇప్పుడు టిడిపి కూటమి వారు అంటేనేమో ఆత్మమాభిమానం అవుతోంది.. ఏది ఏమైనప్పటికీ  జగన్ కు అధికార పక్షానికి తేడా ఏమీ లేదంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: