ఇలాంటి అభాసపరిచే ప్రవర్తనపై టీటీడీ (Tirumala tirupati Devasthanams) చెమటలు పట్టించి… స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఆలయ ఆవరణ, మాడ వీధుల్లో ఎవరైనా రీల్స్ చేస్తూ కనిపిస్తే విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బంది వాటిని గమనించి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ ప్రకటనలో స్పష్టంగా చెప్పింది – "శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవు.ష .. ఇది వినగానే చాలా మందికి షాక్ తగిలింది. అందరికీ అర్థమవుతోంది – తిరుమల అనేది టూరిస్ట్ స్పాట్ కాదు, అది ఆధ్యాత్మికతకు నిలయమైన పవిత్ర స్థలం. అక్కడ తగిన రీతిలో ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. స్వీయ ప్రచారం కోసం స్వామివారి ఆలయాన్ని అవమానించడమంటే – అది క్షమించలేని నేరం!
ఈ పిచ్చి ఓ బాగా పాకిన వైరస్ లాంటిది. ఒకరిని చూసి మరొకరు, వీడియో చూసి ఇంకొకరు – ఇలా రూల్స్ బ్రేక్ చేయాలనిపించేలా చేస్తోంది. కానీ ఈసారి టీటీడీ మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుమలలో భక్తి భావం తప్ప రీల్స్ స్పాట్ కాదు! కంటెంట్ క్రియేట్ చేయాలంటే బహిరంగ ప్రదేశాలెన్నో ఉన్నాయి. కానీ శ్రీవారి ఆలయం మాత్రం ఆత్మ సమర్పణ స్థలం – స్నేహితులతో వినోదం కోసం కాదు! ఇకనైనా కొంతమంది వివేచనతో ప్రవర్తించకపోతే… కేసులు తప్పవన్నది క్లియర్! భక్తి మార్గాన్ని “లైక్స్ & షేర్లు” కోసమే వాడుకుంటే… దేవుడి కోపం మాట అటుంచితే… చట్టం మాత్రం వెంట పడక తప్పదు!