తెలంగాణ మంత్రి కొండా సురేఖ పైన తాజాగా క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసినట్లు వినిపిస్తున్నాయి.. గడిచిన కొద్ది రోజుల క్రితం కేటీఆర్ పైన విమర్శలు చేయడమే కాకుండా హీరోయిన్ సమంతను కేటీఆర్ బెదిరించారని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అన్నట్లుగా మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా తనకు కొన్ని ఫేవర్స్ చేయడానికి కేటీఆర్ చెప్పినట్లుగా చేయాలని సమంతను నాగార్జున బలవంతం చేశారనే పలురకాల ఆరోపణలు చేసింది మంత్రి కొండా సురేఖ.


ఈ విషయం పైన నాగార్జున కొండా సురేఖ పైన పరువు నష్ట దావా వేస్తూ అప్పట్లో కేస్ కూడా ఫైల్ చేశారు. దీనిపైన కోర్టు కూడా ఈ కేసును పరిగణంలోకి తీసుకుంది. డిసెంబర్ 12న కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ కోర్టు ఆదేశాలను జారీ చేయగా.. ఇప్పుడు మరి కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణంలోకి తీసుకున్న కోర్టు  తాజాగా ఈమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పోలీస్ అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.


దీన్నిబట్టి చూస్తూ ఉంటే సమంత ఎఫెక్ట్ కొండ సురేఖ మరికొన్ని చిక్కులలో పడబోతున్నట్లు కనిపిస్తోంది. ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే ఇలాంటి అనర్ధాలు తప్పవంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కోర్టు వెలువడించింది. ఈనెల 21వ తేదీ లోపు క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఈ అంశం పైన కొండా సురేఖ స్పందిస్తూ.. కేసు నమోదు పైన తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత దీనిపైన స్పందిస్తానంటూ తెలియజేసింది మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: