
టీడీపీ పధకాల్ని ఆయుధంగా మార్చుకుంది. “ఓటేస్తే పధకాలు, లేకపోతే చీకటి” అనే సూత్రంతో ప్రజలను ఒత్తిళ్లలో పెడుతోంది. అందుకే కొంతమంది ఓటర్లు డైలమాలో పడిపోతున్నారు. సంక్షేమం కోసం ఓటు వేయాలా? లేక పరివార విశ్వాసాన్ని కాపాడాలా? టీడీపీ ప్లాన్ vs వైసీపీ కౌంటర్ : పది వేల ఓట్లలోనే మహా వ్యూహాలు అమలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రతి ఇంటినీ ఓటు యూనిట్‌గా టార్గెట్ చేస్తున్నారు. రూరల్ అనే బలాన్ని వైసీపీ తన శక్తిగా మారుస్తుందా లేదా అన్నదే సస్పెన్స్. ఇక టీడీపీ మాత్రం పక్కాగా కూటమి వంతున పని చేస్తోంది. వైసీపీ వాళ్లపై బైండోవర్‌లు, కేసులు... అంటే ఒత్తిడి తారాస్థాయిలో ఉంది. దీంతో ఇది ఓ సాధారణ ఉపఎన్నిక కాదు...
పరంపరల సత్తా vs పాలకుల ఒత్తిడి అన్న యుద్ధంగా మారింది. ఎలక్షన్ ఫలితం... సిగ్నల్ ఎక్కువ : ఈసారి నెగ్గేది ఎవరు అనేది కంటే, ఓటర్ల మైండ్‌సెట్ ఏం చెబుతోంది అనేదే ఆసక్తికరంగా మారింది. ఓటు వేయలేదంటే పధకాలు పోతాయన్న భయం – డెమొక్రసీకి డేంజరే. కానీ ఆ భయాన్ని జయించి ఓటర్లు తమ బలాన్ని చూపిస్తే – అది వైఎస్సార్ ఫ్యామిలీపై ఇంకా ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మిగులుతుంది. లేకపోతే – పులివెందులలో పటిష్టమైన దారిని తిరిగే కాలం మొదలయ్యిందన్న సంకేతంగా నిలుస్తుంది. పులివెందుల పోరు – ఒక్క ఉపఎన్నిక కాదు, విశ్వాసం మీద ఓ రిఫరెండం!