గత కొన్నేళ్లుగా  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీగానే కొనసాగుతోంది. ఇటీవలే సిబిఐ అధికారులు కూడా  ఈ కేసుని క్లోజ్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా కడప జడ్పిటిసి ఉప ఎన్నిక సందర్భంగా వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్ కుమార్ ని కలిసినట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసు తాజా పరిణామాల గురించి సునీత ,రాజశేఖర్ రెడ్డి వివరించినట్లుగా సమాచారం. సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై ఎస్పీతో వీరు సమావేశమయ్యారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడడం జరిగింది.


కడుపులో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గత రెండు మూడు రోజులుగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలను చూస్తూ ఉంటే మా తండ్రి వివేకా హత్య గుర్తుకు వస్తోందని.. గొడ్డలిపోటుతో తన తండ్రి పడి ఉంటే అప్పుడు గుండెపోటు అంటూ గతంలో టిడిపి నేతలు చంపారంటూ నమ్మబలికారు.. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ ని తుడిచివేశారని హత్య తర్వాత ఒక లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపినట్లుగా సంతకం చేయమంటే తాను చేయలేదంటూ తెలియజేసింది సునీత. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని తెలిపింది.


ఇప్పుడు జడ్పిటిసి ఉప ఎన్నికలలో భాగంగా ఇలాగే జరుగుతోందని మా బంధువు సురేష్ పైన అవినాష్ అనుచరులు కూడా దాడి చేయించారనే అనుమానంగా ఉందని తెలియజేసింది సునీత. ఇప్పటివరకు దోషులకు ఎలాంటి శిక్ష పడలేదు.. తన తండ్రిని తాను తన భర్త చంపినట్లుగా కేవలం తప్పుడు ప్రచారాలు మాత్రమే చేస్తున్నారని.. కానీ తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడలేదంటూ సునిత మీడియా ముందు కన్నీటి పర్యంతం అయింది. ప్రస్తుతం ఈ సంఘటన ఏపీ అంతట వైరల్ గా మారుతోంది. మరి వైయస్ వివేక కుమార్తె సునీత వ్యాఖ్యలకు ఎవరు సమాధానాలు చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: