పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాలలో జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. పులివెందుల జడ్పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీసులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర పదజాలంతో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులది గుమస్తా మనస్తత్వం అని ఆయన వెల్లడించారు.

నాలుగు సంవత్సరాల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లకు పోలీస్ ఉద్యోగాలు ఉండవంటూ చెప్పుకొచ్చారు.  నేను ఆశ్చర్యానికి గురి కాలేదని ఆయన తెలిపారు.  పులివెందులపై పోలీసులు పగ  పట్టారని  ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పులివెందులలో రీపోలింగ్ జరపాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసీని కోరారు.  కనంపల్లిలో పోలీసులు ఓటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

పులివెందులలో వైసీపీ కార్యాలయం దగ్గర సైతం ఉద్రిక్తత నెలకొంది.  పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలను అరెస్ట్ చేయడానికి పోలీసులు వ్యవహరించినట్టు సమాచారం అందుతోంది.  పోలీస్ కేంద్రంలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి సైతం తమను రానివ్వకుండా అడ్డుకున్నారని  ఆయన చెప్పుకొచ్చారు.

తమను ఓటు వేయకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారని  ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను సైతం  బెదిరించారని  కర్రలు కత్తులతో  పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారని తెలుస్తోంది.  గతంలో ఎన్నడూ ఈ తరహాలో దౌర్జన్యాలు జరగలేదని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరుగుతున్న ఎన్నికలపై సామాన్య ప్రజల్లో సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: