
అయితే ఈ భేటీకి ముందు ట్రంప్ ది ఫ్లాక్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆటను ఇప్పటికే ఒక క్లయింట్ ను కోల్పోయారని చెప్పుకొచ్చారు అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత్ అని ఆయన వెల్లడించారు. చైనా గురించి కూడా తెలిసిందేనని ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు విధించాల్సి వస్తే అది ఆ దేశాల దృష్టిలో విధ్వంసకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
అందుకే అవసరం అయితే చేస్తానని అవసరం లేకపోతె ఉండదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాస్కా భేటీ అనంతరం కూడా ట్రంప్ ఇదే తరహా కామెంట్లు చేయడం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల గురించి మళ్ళీ ఆలోచిస్తానని రెండు మూడు వారాల్లో నిరయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ తాజా కామెంట్ల గురించి ఢిల్లీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది. భారత్ మిత్ర దేశమే అయినా వాణిజ్య ఒప్పందాలు మాత్రం సరిగ్గా లేవని ఆయన వెల్లడించారు. అయితే రష్యాలో చమురు వాణిజ్యం విషయంలో భారత్ మాత్రం ఇంకా వెనక్కు తగ్గలేదు. ఐవోసీ చైర్మన్ మాట్లాడుతూ రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం గురించి తమకు ఎలాంటి సూచనలు రాలేదని అన్నారు.