
రోజా మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తానని చెప్పడం హాస్యాస్పదం అంటూ తెలిపింది.. సూర్యుడిని అరచేతితో ఎలా ఆపలేరో ఆయన సినిమాలను కూడా ఎవరు అలా ఆపలేరంటూ తెలియజేసింది. సినిమా బాగుంటే ప్రతి ఒక్కరు చూస్తారు లేకపోతే ఎవరు చూడరని తెలిపింది.హరిహర వీరమల్లు చిత్రానికి ఎమ్మెల్యేలు టికెట్లు ఫ్రీగా ఇచ్చిన అభిమానులు చూడలేదంటూ సెటైర్ వేయడం జరిగింది రోజా. రాజకీయం రాజకీయంగానే చూడాలి.. సినిమాను సినిమా వాళ్లే చూసుకుంటారంటూ తెలిపింది మంత్రి రోజా.
వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిడితే.. కొన్ని సినిమాల పరిస్థితిలు ఎలా అయ్యాయో చూసాము కాబట్టి సినిమాలను రాజకీయాలను అసలు కలపకండి అంటు మంత్రి రోజా తెలియజేసింది.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో లేరు ఆయన సినిమాలను చేసుకుంటూ ఉన్నారని అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ సినిమాలు ఆడుతున్నాయి. టిడిపి నేతలు మాటలు విని జనాలు సైతం నవ్వుకుంటున్నారు అంటూ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సులలో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నారు అంటు దీన్ని బట్టి చూస్తే బస్సులో లోకల్ గా మాత్రమే తిరగాలి రాష్ట్రమంతా ఉచితం కాదు అంటూ తెలిపింది మాజీ మంత్రి రోజా. ఇన్ని మోసాలు జరుగుతూ ఉంటే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని తెలిపింది.