కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొన్ని చట్టాలను తీసుకువచ్చి రాజకీయ నాయకులను కలవరపెడుతోంది. తాజాగా కేంద్రం ఆమోదం  తెలిపినటువంటి ఒక చట్టంఫై విపక్షాలు ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే తీవ్రమైన నేరారోపణలతో  అరెస్ట్ అయినటువంటి వారు వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉండే సందర్భంలో ప్రధానమంత్రి అయిన ముఖ్యమంత్రి లేదా మంత్రులైన ఎవరైనా సరే పదవిని కోల్పోయేలా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ  కోపానికి వస్తున్నాయి. ఈ బిల్లు గనుక చట్టం అయితే మాత్రం ఐదేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. 

 నేరానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు అయిన తర్వాత 30 రోజులపాటు జైల్లో ఉంటే 31 రోజున మాజీ అయినట్లే. ముఖ్యంగా వారి సమ్మతి లేకపోయినా ఆ పదవి నుంచి ఊడిపోయినట్లే. ఈ విధంగా బిల్లులో అనేక రకాల నిబంధనలు చేసి  లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రధానమంత్రి, మంత్రి, ముఖ్య మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఎవరికైనా వర్తిస్తుందని  తెలుస్తోంది.. అయితే ఈ బిల్లుపై తాజాగా  ఎంపీ ప్రియాంక గాంధీ కూడా విమర్శించారు. ఈ బిల్లును అడ్డం పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాలను వరుసగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి 30 రోజులపాటు కావాలనే జైల్లో ఉంచుతుంది. దీనివల్ల వారి పదవులు కోల్పోయేలా చేస్తుందని మండిపడ్డారు. అయితే ఈ బిల్లు చట్టం అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సీఎంలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని అంటున్నారు..

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 2023 సంవత్సరంలో అరెస్టై 53 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. అంటే ఈ బిల్లు చట్టమైతే ఆయనకు కూడా వర్తిస్తుందా..ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా ఊడిపోతుందా.. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో అరెస్టు 30 రోజుల కంటే ఎక్కువగానే జైల్లో ఉన్నారు.. మరి ఈయన పదవి కూడా ఊడిపోయే అవకాశం ఉందా అంటూ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక వీళ్లే కాకుండా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి జగన్, బిజెపి అధికారంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా సీఎంలు, మంత్రులు కూడా జైల్లో గడిపి వచ్చారు.

 ఈ బిల్లు చట్టం అయితే వీరు చేసిన నేరాలు రుజువైతే మాత్రం వీరి పదవులు కూడా ఊడిపోయే అవకాశం ఉంటుందా అంటూ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బిజెపి అధికారం కోల్పోయిన తర్వాత  వీళ్లు కూడా ఎక్కడైనా తప్పు చేసి ఉంటే వారిని  అరెస్టు చేసి జైల్లో పెట్టి 30 రోజులు ఉంచితే 31వరోజు  తర్వాత వీరి పరిస్థితి ఏంటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.. మరి చూడాలి ఈ బిల్లు లోక్సభలో ప్రవేశ పెట్టారు. కానీ చట్టం అవుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: