
కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వానికి, పార్టీకి కూడా నష్టం కలిగించేలా కనిపిస్తోంది అంటూ నారా లోకేష్ ఆగ్రహాన్ని తెలిపారు. అలాగే పెరోల్ వంటి విషయాలను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హోమ్ మినిస్టర్ అనిత కూడా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో వైసిపి ఒక క్రిమినల్ మాఫియాగా మారుతోందని మంత్రులతో నారా లోకేష్ చర్చించారు. మొదట ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి మీద విష ప్రసారం చేశారు ఇప్పుడు అది మంత్రుల స్థాయి వరకు వెళ్ళింది.. కూటమి ఎమ్మెల్యేల మీద కూడా కుట్రలు చేస్తున్నారంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
తప్పు ఎవరిదైనప్పటికీ కూడా శ్రీశైలం ఎమ్మెల్యే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదంటూ నారా లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వం పైన ప్రజలకు సానుకూల ప్రభావం ఉన్న సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తుందంటూ ఫైర్ అయ్యారు.. అందులో దగ్గుపాటి ప్రసాద్- అనంతపురం
బుడ్డ రాజశేఖర్ రెడ్డి - శ్రీశైలం
కూన రవికుమార్ - ఆముదాలవలస
నజీర్ అహ్మద్ - గుంటూరు ఈస్ట్
కొలికపూడి శ్రీనివాసరావు- తిరువూరు
గూడూరు ఎమ్మెల్యే సునీల్
వంటి నేతల పేర్లను మంత్రుల దగ్గర ప్రస్తావిస్తూ ప్రతి ఇన్చార్జి మంత్రి తన పరిధిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేరా అంటూ ప్రశ్నించారట. క్యాబినెట్ మీటింగ్ కు సమావేశానికి ముందు చర్చలు జరుగుతున్న సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి పైన చర్చించారని ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించారట. ఇకపైన ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని లోకేష్ హెచ్చరించినట్లు వినిపిస్తున్నాయి.