
అయితే ఈ ప్రక్రియలో అన్ని విధాలుగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఎలాంటి వైకల్యం లేకపోయినా కొంతమంది పెన్షన్స్ పొందుతున్నారని కొంతమంది అధికారులు తెలిపారని అనర్హులైన పింఛన్లు ధ్రువీకరించడానికి ప్రత్యేకమైన వైద్య బృందాలను కూడా తాము నియమించామని.. నకిలీ పింఛన్లను మాత్రమే తొలగించాలని చెప్పాము. అర్హులైన ఏ ఒక్క దివ్యాంగుల పింఛన్ ని కూడా రద్దు కాకూడదని ఆదేశాలను జారీ చేశారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా పింఛన్ పొందే దివ్యాంగులకు, హెల్త్ పింఛన్ పొందే వారికి ఎప్పటిలాగే కూడా ప్రతి నెల పింఛన్ అందిస్తామంటూ తెలిపారు. వారికి పంపించిన నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు.
మంత్రి లోకేష్ దివ్యాంగుల పింఛన్ గురించి ఒక కీలకమైన ప్రకటన చేశారు. అర్హులైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగదని పింఛన్ల విషయంలో పూర్తిగా నే పారదర్శకత పాటించాలని తెలిపారు. తొలగించిన పింఛన్ల జాబితాను గ్రామ సచివాలయాల వద్ద లిస్టు అధికారులు పంపిస్తారని తెలియజేశారు. పింఛన్ తొలగించబడిన వారిలో అర్హులైన వారు ఎవరైనా ఉంటే రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటు తెలియజేశారు.1.20 లక్షల పింఛన్లను నిలిపివేశారని అందులో టిడిపికి చెందిన వారు కూడా ఉన్నారని మంత్రులు లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ.. ఏ పార్టీ వారైనా సరే అర్హత ఉంటే ఇవ్వాలి అని సూచించారట.