
అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ శ్రీకాకుళం జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ ఏ పార్టీ అండగా లేకపోయిన.. ఒక టీడీపీ ఎమ్మెల్యేకు ఆయన అండగా నిలిచడం ఆసక్తి రేపుతోంది. గత కొద్దిరోజులుగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ KGBV ప్రిన్సిపల్ సౌమ్యను వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ విషయం అటు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ఒక సంచలనంగా మారుతోంది. అయితే ఈ విషయాన్ని వైసిపి వైరల్ గా చేయడంతో టిడిపి ఎమ్మెల్యేకు అండగా నిలిచారు దువ్వాడ.
ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం పైన రవికుమార్ గెలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ కానీ అచ్చెనాయుడు దక్కించుకున్నారు.. ఇక అప్పటి నుంచి అటు రవికుమార్ కు ఆయనతో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని సాకుగా తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్.. కూన రవికుమార్ విషయంలో ధర్మాన కుటుంబంతో పాటుగా కింజారావు కుటుంబం హస్తం ఉందనే విధంగా పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది. వీరింతటికి కారణం ఆ రెండు కులాలే ఆని వేలయ సామాజిక వర్గం అంటూ తెలిపారు. రవికుమార్ తో పాటు దువ్వాడ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ విషయాన్ని కాళింగ కులంపై దాడిగా మార్చేశారు దువ్వాడ.
తనకు ఉమ్మడి శత్రువులుగా ఆ రెండు కుటుంబాలు ఉన్నాయంటూ దువ్వాడ తెలియజేశారు.. ఇప్పుడు ఏ పార్టీ వారు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో తమ సామాజిక వర్గం పైన దాడి జరుగుతోందని వీటిని ఒక కుల పోరుగా మార్చాలని దువ్వాడ భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. దీంతో రాబోయే రోజుల్లో కాళింగ వారంతా ఏకం కావాలంటూ దువ్వాడ పిలుపునివ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు ప్రయత్నం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.