
ఆ తర్వాత 2014లో వైసీపీ పార్టీలోకి మారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. అలా మరో ఐదేళ్లపాటు విపక్షంలో ఉన్న రాధా 2019లో వైసీపీ నుంచి టిడిపిలోకి చేరారు. కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ విపక్షనేతగానే మిగిలిపోయారు. 2024 ఎన్నికలలో రాధా వైసిపి నుంచి ఆహ్వానం వచ్చిన చేరకుండా టిడిపిలోనే ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రాధాకు తగిన పదవి ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. అయితే అది కూడా ఎమ్మెల్సీ పదవే అని చెప్పిన.. ఆ పదవి మాత్రం దక్కలేదని అభిమానులు ఇప్పటికీ బాధపడుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు చాలావరకు భర్తీ చేసిన రాధాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా లేవని.. 2027 లో మాత్రమే భారీ ఎత్తున ఖాళీలు కాబోతున్నాయి. దీంతో అప్పుడే రాధాకు పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.రాధా అనుచరులు మాత్రం తమ నాయకుడికి పదవి పైన ఎలాంటి ఆశలు లేకపోయినా ఆయనని చట్టసభలలో చూడాలని కోరుకుంటున్నామని అందుకోసం సుమారుగా 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నామని తెలుపుతున్నారు. మరి టీడీపీ అధిష్టానం కూడా ఇకనైనా రాధా స్థాయికి తగ్గ పదవి ఇస్తారో లేదో చూడాలి. మరి ఈ విషయాన్ని టిడిపి అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి.