ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల( టీడీపీ,జనసేన) పార్టీలు చాలానే నెగిటివ్ సృష్టించేలా చేశారు. వీటికి తోడు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా దుష్ప్రచారం చేశారు. దాదాపుగా ఈ దుష్ప్రచారం రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ప్రతి అంశంలో కూడా గోరంత విషయాన్ని కొండంతను చేసి కొన్ని అనుకూల మీడియాలో చూపించడమే కాకుండా ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. జగన్ మీద ఒక ద్వేషాన్ని ప్రజలలో నిక్షిప్తం చేసేలా చేశారు. వాటిని రోజురోజుకి పెంచుతూనే ఉన్నారు.


కానీ నిజాలు నెమ్మదిగానే బయటపడతాయనే మాట ఇప్పుడు నిజమౌతోంది. జగన్ ఇచ్చిన ఉద్యోగాల విషయం గురించి, జగన్ తెచ్చిన మద్యం  పాలసీ, నాడు నేడు కింద స్కూళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇళ్ల పట్టా, డీఎస్సీ పోస్టులు, పోలీస్ నియామకాలు  ఇలా ఎన్నో మంచి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అలాగే గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాడు జగన్ చేసిన ప్రయత్నాన్ని.. కావాలని కొంతమంది విష ప్రచారం చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలతో వచ్చిన చిరంజీవి విషయంలో జగన్ అహంకారిగా ప్రవర్తించారని.. సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఇంటి లోపలికి తీసుకు వెళ్లడానికి.. కనీసం బయటికి కూడా రాలేదంటూ చాలానే దుష్ప్రచారం చేశారు.

అయితే వాస్తవంగా జగన్ ఇంటి దగ్గర నుంచి లోపలికి వెళ్లాలంటే జగన్ అయినా సరే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక బార్క్యాడ్ లాంటిది కట్టడం వల్ల అక్కడి నుంచి ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్లాల్సిందే.. అయితే సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీలు జగన్ ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి నడిపించారని ఒక విష ప్రచారం కూడా చేశారు. కానీ అక్కడికి వచ్చిన సిని సెలెబ్రెటీలతో జగన్ ఎంత బాగా మాట్లాడారు?ఎలా రిసీవ్ చేసుకున్నారు ? సినీ ఇండస్ట్రీ సమస్యల పైన ఎలా స్పందించారు? ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనే అంశం పైన తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా మారిపోయాయి. అటు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి టికెట్ల వ్యవహారాల పెంపు విషయంపై చిరంజీవే స్వయంగా  ఒక లెటర్ ద్వారా తెలియజేశారు.


వీటన్నిటిని చూస్తూ ఉంటే అప్పుడు  జగన్ పై చేసిన దుష్ప్రచారాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రతి చిన్న విషయంలో కూడా జగన్ ని టార్గెట్ గానే చేసి వాటిని పేపర్లలో టీవీలలో హైలెట్గా చేసి , డిబేట్ లు పెట్టి మరీ ఒక అబద్ధాన్ని పదేపదే నిజం నిజం అంటూ నమ్మించినటువంటి సందర్భాలు  చాలానే జరిగాయి.. అయితే ఇప్పుడు ఆ అబద్ధాల నుంచి నిజాలుగా బయటకు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా జగన్ పై దుష్ప్రచారం చేయడం ఆపుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: