
మనందరికీ తెలిసిందే, తమిళనాడులోని కరూర్‌లో శనివారం సాయంత్రం టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక్కరే కాదు, ఇద్దరే కాదు, దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ కూడా స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే తమిళనాడు ప్రజలు మాత్రం ఈ విషయంలో అస్సలు సహనం పాటించడం లేదు. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"10,000 మంది సరిపడే ప్రాంగణంలో 30,000 మందికి ఎంట్రీ ఎలా ఇచ్చారు? ఇదంతా పొలిటికల్ గేమ్ కాదా? ప్రజలు ప్రాణాలు కోల్పోతేనే మీకు పొలిటికల్‌గా లాభమా?" అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సీఎం స్టాలిన్‌ను కూడా ప్రశ్నిస్తూ—"ప్రజలకు అండగా ఉండే నిజమైన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది?"అని, ఇలాంటి ఘటన జరిగితే సీఎం స్టాలిన్ వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా "విజయ్ దళపతి అరెస్ట్" కోసం హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది తమిళనాడు ప్రజలు ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, సీఎం స్టాలిన్ పక్కా ప్రూఫ్‌ల ఆధారంగా విజయ్ దళపతిని నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌తో అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆ దిశగా పోలీసులు పేపర్స్ రెడీ చేసి సంతకాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఆ పేపర్స్ తో విజయ్ ఇంటికి వెళ్లి మరి అరెస్ట్ చేయబోతున్నారట పోలీసులు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హీట్ పెంచేస్తోంది. నిజంగా ఒకవేళ విజయ్ దళపతి అరెస్ట్ అయితే, తమిళనాడు మొత్తం అడ్డుకి పోతుంది. విజయ్ అభిమానులు ఎక్కడా ఊరుకోరు. దీంతో తమిళనాడు మొత్తం హీటెక్కిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.