వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రదర్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ కేసులో నిందితులు ఎవరో తేలే వరకు విరమించేది లేదని వివేకానంద రెడ్డి ఫ్యామిలీ  ఆరోపిస్తోంది. ఇదే తరుణంలో ఈ కేసుపై మరోసారి సిబిఐ కోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత  పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసు విచారణను కొనసాగించాలని సూత్రధారుల గురించి ఇంకా బయటకు రావాల్సి ఉందని ఆమె కోర్టు కు  విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రధానంగా నిందితులు  ఎవరనేది పరిశీలించి వారికి పిటిషన్ కాపీలు అందేలా చూడాలని తెలియజేశారు. 

గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు జరిగినటువంటి విచారణలో గత ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం తెలియజేసింది. ఆ సమయంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే సిబిఐ కేసును కొనసాగిస్తామని తెలియజేసింది. కానీ ఈ కేసు పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశాలు జారీ చేస్తూ 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు వైఎస్ సునీత హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మరోసారి విచారణ చేయాలని కోరుతున్నారు.

వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారని దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో ఇప్పటివరకు బయటకు రాకపోవడం దారుణం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కేసులోని పూర్వపరాలు బయటకు వస్తాయని అనుకుంటే ఆయన కూడా మోసం చేశారని తెలియజేసింది. ఈ విధంగా ఎలాగైనా ఈ కేసును చేదించాలని  మరోసారి సిబిఐ కి  పిటిషన్ దాఖలు చేసింది  వైయస్ సునీత. మరి చూడాలి ఈ కేసులో ఇప్పుడైనా నిందితుల వివరాలు బయటకు వస్తాయా, లేదంటే మునుపటిలాగే తేలిపోతుందా అనేది  ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: