గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉందని రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించేందుకే సిబ్బంది కష్టపడుతోందంటూ తెలుపుతున్నారు. అయినా కూడా ఇంకా పోలీసుల అవసరం ఉందని త్వరలోనే ఖాళీగా పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వాన్ని కోరామంటూ డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. గత నెల 29వ తేదీన రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయిన కుమార్ విశ్వజిత్ కు లేఖ రాశారు.
దీంతో పోలీస్ శాఖలలో వివిధ విభాగాలలో సివిల్, ఏపీఎస్పీ, సిపిఎల్, AR, పిటిఓ కమ్యూనికేషన్ వంటివి భాగాలలో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు ఉన్నాయని తెలియజేశారు. ముఖ్యంగా సివిల్ కానిస్టేబుల్ 3622, ఏఆర్ కానిస్టేబుల్2000, ఏపీఎస్పీ 4587 పోస్టులు ఉన్నాయట వీటితో పాటు మరికొన్ని పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని అలాగే ఎస్సై పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయంటూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటూ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో 6,100 కాళీ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా 11 వేలకు పైగా పోస్టులతో మరొక నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి