మరో కొద్ది రోజులలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారని విషయాలపై ఊహాగానాలు తారస్థాయికి చేరాయి. మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా? లేకపోతే కొత్త ముఖం కనిపిస్తుందా? అనే విషయంపై ఇండియా టుడే-సి సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా వీరిలో లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ పేరు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. రెండవ పేరు ప్రశాంత్ కిషోర్ ఉండగా, మూడవ స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు ఉన్నది.



అసలు విషయంలోకి వెళ్తే సర్వే ఏం చెబుతోంది అంటే.. ఈ సర్వేల 36% మంది ప్రజలు తేజస్వి యాదవ్ ను కోరుకుంటున్నారని, 23 మంది శాతం ప్రజలు జన స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ ను కోరుకుంటున్నారని, కానీ 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన జెడియు అధినేత నితీష్ కుమార్ కి మాత్రం 16% మంది మాత్రమే కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నాయి. అయితే వీరందరితోపాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి .అందులో ఎల్జేపి అధినేత చిరాగ్ పాశ్వాన్, బిజెపి నాయకుడు ప్రస్తుత విహార ఆర్థిక శాఖ మంత్రి సామ్రాట్ చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. వీరికి కూడా 8% పైగా ప్రజలు అక్కడ మద్దతు తెలుపుతున్నట్లు తెలియజేస్తున్నారు.



2020 అసెంబ్లీ ఎన్నికలలో బీహార్లో ఎన్డీఏ కూటమి అత్యధికంగా 74 స్థానాలను గెలుచుకుంది. జెడియు 43 స్థానాలు లభించగా , జెడియు కంటే బిజెపి పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన కానీ బిజెపి మాత్రం నితీష్ నే ముఖ్యమంత్రిగా చేశారు. ఈసారి కూడా ఎన్డీఏ తరపున నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయనకి ప్రజాదారణ తగ్గిపోయిందనే విధంగా సర్వేలు తెలియజేస్తున్నాయి.మరి దీని తర్వాత బిజెపి పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి. నవంబర్ 6 ,11వ తేదీలలో రెండు దశలలో పోలింగ్ జరగబోతోంది. మొదటి దశ 121 స్థానాలకు మిగిలిన 122 స్థానాలకు రెండవ దశలో జరగబోతోంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: