10 సంవత్సరాలు ఏకధాటిగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కసారిగా ముక్కలైపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం.. లిక్కర్ కేసులో ఇరుక్కొని కవిత అరెస్టయి జైలుకు వెళ్లడం..ఇలా ఎన్నో జరిగాయి. అయితే జైలు నుండి కవిత బయటికి వచ్చాక సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్గా నిలిచింది. అంతే కాదు కేటీఆర్,హరీష్ రావు, సంతోష్ రావు ఇలా ఎంతోమంది ఇంట్లోని వారిని కూడా బయట వేసింది. ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని,హరీష్ రావు,సంతోష రావు ఇద్దరు కేసీఆర్ ని ముంచేస్తారని, కాళేశ్వరంలో అవినీతి చేసింది హరీష్ రావు,సంతోష్ రావులే అంటూ ఆరోపించింది.అలాగే అన్నను వారి నుండి రక్షించాలని కేసీఆర్ కి చెప్పింది. అయితే ఇలా ఎన్నో ఆరోపణలు చేయడంతో కేసీఆర్ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.దీంతో కవిత మళ్ళీ కొత్తరాగం పాడింది.

తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టాలని చూస్తుంది. అయితే వచ్చే ఎలక్షన్సే టార్గెట్ గా పెట్టుకొని జాగృతి పేరుతో కవిత బీసీ నినాదంతో కవిత ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుండే జనాలను మచ్చిక చేసుకోవాలని జాగృతి జనం బాట పేరుతో ప్రతి ఒక్క జిల్లాకు వెళ్లి యాత్ర చేయబోతోంది.అలా జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టిన కవిత తాజాగా తండ్రి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే మనస్తత్వం ఆలోచన నాకు లేదు రాదు.ఆ చెట్టు నీడలో ఉన్నన్ని రోజులు ఆ చెట్టును కాపాడుకోవడం కోసం, చెట్టును దుర్మార్గుల నుండి రక్షించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను.

 ఆ చెట్టుని సంరక్షించుకోవడం కోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఇవాళ చెట్టు నీడ నాది కాదని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరు చెప్పుకొని బతకడం ఎందుకు..చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే వ్యక్తిని కానప్పుడు ఆ చెట్టు నీడలో కూడా ఉండలేను. చెట్టు పేరు చెప్పుకొని సమాజంలో ముందుకు పోలేను అంటూ క్లారిటీ ఇచ్చింది.అలా పరోక్షంగా కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చింది కవిత.అలాగే జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేసిన సమయంలో తన తండ్రి పేరు లేకుండానే యాత్ర చేస్తానని పరోక్షంగా చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: