బీఆర్ఎస్ మహిళా కార్యకర్త చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తన ఆత్మహత్యకు కేటీఆరే కారణం అంటూ ఆ మహిళ పెట్టిన పోస్ట్ అందర్నీ షాకింగ్ కి గురిచేస్తుంది.మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు.. ఎందుకు కేటీఆర్ తన చావుకు కారణం అంటుంది అనే సంగతి ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశప్రియ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్టు సంచలనంగా మారింది.బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై వేధింపులకు గురిచేస్తుంది అని, ఎన్నిసార్లు చెప్పినా కూడా తనని టార్చర్ చేస్తున్నారని, ముఖ్యంగా హెచ్ ఎస్, పీజేఎంఆర్, కేటీఆర్ వీళ్లు ముగ్గురు నా చావుకు కారణమని,ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి నా నుండి ఏ పోస్టు రాకపోతే నేను చనిపోయినట్టే అర్థం చేసుకోండి అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తనని వేధించిన ఆధారాలు అన్నీ కూడా వాట్సాప్ సెల్ఫ్ చాట్ లో ఉన్నాయి అని తెలియజేసింది. 

అంతేకాదు ఇదే తన మరణం వాంగ్మూలం అని, చనిపోకుండా బీఆర్ఎస్ పై కేసు నమోదు చేస్తే కచ్చితంగా వాళ్ళు బెయిల్ తో బయటికి వస్తారు.అందుకే ఇలా చేస్తున్నాను అంటూ తెలియజేసింది.దాంతో ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ మహిళా కార్యకర్త ఆశప్రియ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారడంతో చాలామంది షాక్ అవుతున్నారు.ఇక  మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి ఆశప్రియ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుకుగా ఉండేది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు సడన్గా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పింది.

ఇక ఈమె బిఆర్ఎస్ పార్టీ నుండి తప్పుకోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆమెపై ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ఆ మహిళ తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే తనని వేధిస్తున్నారో వారి గురించి తన ట్విట్టర్ ఖాతాలో ఒకరు నన్ను వేధిస్తున్నారని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని, తెలిపింది.అలాగే కొన్ని స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసింది. పార్టీలో ఉండే కొంతమంది మహిళలతో నీకు సంబంధం ఉందని,వాళ్ళు నాతో మాట్లాడిన ఫోన్ లో చెప్పినవన్నీ నా దగ్గర ఉన్నాయని,నన్ను ఎవరైతే వేధిస్తున్నారో వాళ్లని నువ్వు పక్కన పెట్టుకుంటున్నావ్ అంటూ కేటీఆర్ గురించి చెప్పిన పలు పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఏది ఏమైనప్పటికీ ఆశప్రియ మరణిస్తే మాత్రం అది కేటీఆర్ మెడకు చుట్టుకునేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: