బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకి హీటేక్కిస్తున్నాయి. ఒకవైపు హామీలే కాకుండా మరొకవైపు సీట్ల పంపకాల విషయంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తాజాగా జేడీయూ పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో సీఎం నితీష్ కుమార్ ఒక్కసారిగా సర్జరీకల్ స్ట్రైక్ చేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి 16 మంది నాయకులను పార్టీ బహిష్కరించినట్లు తెలుస్తోంది. గడిచిన 48 గంటలలో పార్టీ రెండు జాబితాలను విడుదల చేయగా ,ఇందులో 16 మంది నాయకుల పైన తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. మొదటి జాబితాలో 11 మంది ఉండగా ఇప్పుడు రెండవ జాబితాలో 5 మంది నాయకులు ఉన్నట్లు సమాచారం.



గోపాల్ మండల్ సహా కొంతమంది ముఖ్య నేతలను తొలగించారు. ముఖ్యంగా పార్టీ తిరుగుబాటు నాయకులను రెండు జాబితాలను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే పార్టీ సెక్రటరీ జనరల్ డి.చందన్ కుమార్ సింగ్ ఉన్నట్లుగా లేఖలో తెలియజేశారు. అలా మొత్తం మీద 16 మందిని సస్పెండ్ చేస్తూ వీరందరూ 2025 లో పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు వ్యవహరించారని అందుకే వీరిని పార్టీ నుంచి బహిష్కరించామంటూ తెలియజేశారు.


పార్టీ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న, లేకపోతే తిరుగుబాటు అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన సరే ఇలాంటి నిర్ణయాలే ఉంటాయంటూ సీఎం నితీష్ కుమార్ తెలియజేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర నాయకత్వానికి, జిల్లాలో నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పైన నిషేధాలు ఉన్నాయని కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి కొంతమంది నాయకుల పైన వేటు పడే అవకాశం ఉందంటూ వెల్లడించారు.


బహిష్కరించబడిన నాయకుల జాబితా విషయానికి వస్తే.
1). గోపాల్ మండల్
2). సంజీవ్ శ్యామ్ సింగ్
3). శైలేష్ కుమార్
4). రణవిజయ్ సింగ్
5). హిమరాజ్ సింగ్
6). ప్రభాత్ కిరణ్
7). సంజయ్ ప్రసాద్
8). సుదర్శన్ కుమార్
9). లవ్ కుమార్
10). వివేక్ శుక్ల
11). ఆశా సుమన్
12). దివ్యాంశు భరద్వాజ్
13). ఆస్మా పర్వీన్
14). అమర్ కుమార్ సింగ్
15). మహేశ్వర్ ప్రసాద్ యాదవ్
16). శ్యామ్ బహదూర్ సింగ్

మరింత సమాచారం తెలుసుకోండి: