కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నాయకురాలు.. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఓ ఊపు ఊపిన ఈమె ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి తన సత్తా ఏంటో చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా జాగృతి పేరుతో  ఆమె ప్రత్యేకమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.. అలాంటి కవిత ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులు చేసిన అవినీతి తప్పు పనుల గురించి బయట పెట్టింది.. వీళ్లే నన్ను బయటకు పంపేలా చేశారని వాళ్లు కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలంటూ అప్పట్లో సంభోదించింది.. అయితే కవిత ఇవే కాకుండా తాజాగా నిజామాబాద్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ పై కూడా విమర్శలు గుప్పించింది.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నా లేనట్టేనని, అసలు ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పుకొచ్చింది. 

అప్పట్లో నిజామాబాద్ లో కే టాక్స్ నడుస్తోందని ధర్మపురి అరవింద్ ఆరోపించారని ఇప్పుడు మరి మీ టాక్స్ నడుస్తుందా అంటూ ప్రశ్నించింది.. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న 42% బీసీ బిల్లుకు సంబంధించిన విషయం పై కూడా ఆమె మాట్లాడింది.. ఈ బిల్లుపై తెలంగాణ బీజేపీ ఎంపీలకు చిత్త శుద్ధి లేదని చెప్పుకొచ్చింది.. నిజంగా వారికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ఉంటే వారు రాజీనామా చేస్తే  ఇట్టే బీసీ బిల్లు అమలు అవుతుందని తెలియజేసింది.. కేంద్రంలో మోడీ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తోందని..

మీరు రాజీనామా చేస్తే బీసీ బిల్లు ఇట్టే నడుచుకుంటూ వస్తుందని అన్నది. తాను జనం బాట యాత్ర ప్రారంభించగానే ఆ ఎంపీ గుండెల్లో గుణపం దింపినంత పనైందని, ఆయన వెంటనే నాపై,నా కుటుంబం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. త్వరలోనే ఆ ఎంపీ అవినీతి చిట్టా కూడా బయట పెడతానని అన్నది. ప్రస్తుతం కవిత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ గా మారాయి.. మరి హరీష్ రావు సంతోష్ రావుల గురించి మాట్లాడినట్టే ఆ ఎంపీ గురించి కూడా ఏమైనా బయట పడుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: