ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే ఆయన చంద్రబాబు శిష్యుడు అని అంటారు.. అవును నిజమే రేవంత్ రెడ్డి రాజకీయం నేర్చుకున్నది కూడా చంద్రబాబును చూసే అని చెప్పవచ్చు. అంతేకాదు ఆయనకు పాలిటిక్స్ నేర్పింది కూడా టిడిపి పార్టీయే.. అలాంటి చంద్రబాబు ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చివరికి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే స్థాయికి ఎదిగారు.. కానీ చంద్రబాబు అందిస్తున్నటువంటి పాలన మాత్రం ఆయన అందించలేకపోతున్నారని తెలుస్తోంది. మరి ఏం జరిగింది.. చంద్రబాబు వల్ల రేవంత్ కు తగిలిన షాక్ ఏంటో చూద్దాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తుఫాను ముంచేసింది.. వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్రమంతా అలర్ట్ అయ్యారు..ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు  పంటలు నష్టపోయాయి. కానీ ప్రజలకు నష్టం కలగకూడదని ప్రాణ నష్టం జరగకూడదని సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయారు.. 

ముఖ్యంగా వర్షం ఎలా రాబోతుంది. ఎప్పుడు వస్తుంది దాని వల్ల కలిగే నష్టాలు ఏంటని ముందుగానే బేరీజు వేసి ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలతో కమ్యూనికేషన్ లో ఉన్నారు. ముందుగా స్కూళ్ల, కాలేజీలకు సెలవులు, వ్యాపార సంస్థలకు సెలవులు ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, వైద్య, ఎన్డిఆర్ఎఫ్ బృందాలన్నింటిని అలర్టుగా ఉంచారు. దీంతో తుఫాను పూర్తయిన తర్వాత రోడ్లపై, కాలువల్లో పడిపోయిన చెట్లను కోసివేసి  క్లియర్ చేయడం వంటివి చాలా స్పీడ్ గా పనులు చేయించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా వెంట వెంటనే చేసుకొచ్చారు. ఇలా ఈ పనులన్నీ చేపట్టడం కోసం బుధవారం పూర్తిస్థాయిలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా చంద్రబాబు అధికారులతో కూర్చుని తాను నిద్రపోకుండా పనిచేయించారు.. ఆయన పనితనాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే షాక్ అయిపోయారు..

దీంతో ఈ ఎఫెక్ట్  సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పడింది.. మొంథా  తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా పడింది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్  జిల్లాల్లో వరద బీభత్సం పెరగడంతో చాలా పంట నష్టం జరిగింది.. కానీ తెలంగాణ సీఎం మాత్రం చంద్రబాబులా ప్రజల్ని ముందుగా అలర్ట్ చేయలేకపోయారు. దీంతో చిన్న వర్షాలకే తెలంగాణలో చెదురు మొదురు ఘటనలు జరిగి కొన్ని వాహనాలు నీటిలో మునిగిపోయాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీనిపై ముందస్తు ప్రణాళిక వేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎమ్మెల్యే వారి వారి కాన్స్టెన్సీ లో ఉండి ఎప్పటికప్పుడు అన్ని సహాయ సహకారాలు అందించారు. కానీ తెలంగాణలో ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం ఎవరి ఇండ్లలో వారే ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు లాగా అలర్ట్ కాలేకపోయారని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: