ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు తన పాలనా అనుభవం అయితే నేర్పలేదు గాని ,జగన్ పాలన అనుభవాన్ని చంద్రబాబు వినియోగించుకున్నాడు. ముఖ్యంగా జగన్ హయాంలో తీసుకువచ్చిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నవరత్నాలను పేరు మార్చి సూపర్ సిక్స్ పథకాలతో అమలు చేశారు. ఇలాంటి వాటిని కాకుండా మరికొన్ని పథకాలను పేరు మార్చి సీఎం చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రచార విషయంలో మాత్రం సీఎం చంద్రబాబును చూసి జగన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వంలో ఫెయిల్ అయ్యింది కూడా ప్రచారం చేసుకోవడంలోనే. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నేతలు తెలియజేశారు.



వరదలు, తుఫాన్లు, కరోనా సమయంలో అన్నిటిలో కూడా పర్ఫెక్ట్ గా చేసింది వైసీపీ ప్రభుత్వం.  ప్రజలకు కూడా వైసిపి చేసిన సహాయాలు అందాయి. కానీ ఎలాంటి ప్రచారం అయితే చేయలేదు. వైసిపి ప్రభుత్వం హయాంలో వరదలు వచ్చిన తుఫాను వచ్చినా కూడా అధికార యంత్రాంగం అంతా పనిచేయాలి, పరిహారాలు ఇచ్చేయాలి, పరిహారం ఇచ్చిన తర్వాత అది నష్టపోయిన వారికి అందిందా? లేదా అని చెక్ చేయడానికి వెళ్లేవారు మాజీ సీఎం జగన్. కానీ దానివల్ల ప్రచారం పెద్దగా చేసుకోలేకపోయారు.


కానీ ఇటీవలే మొంథా తుఫాన్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ విషయంలో టిడిపి అనుకూల మీడియాలో మాత్రం తుఫాను ముందుగానే ఆపేసే ధీరుడు, తుఫాన్ ని ఎదిరించే వీరుడు, తుఫాను కంట్రోల్ చేసే వీరుడు అంటూ చంద్రబాబుని పొగిడేస్తూ మీడియాలో చేసిన హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. సీఎం చంద్రబాబు కూడా వీడియో కాన్ఫరెన్స్, టెలి కాన్ఫరెన్స్ వంటివి మాట్లాడుతున్న వాటిని హైలెట్ చేశాయి కూటమి అనుకూల మీడియా. కానీ ఇప్పుడు చంద్రబాబును చూసుకొని జగన్ కూడా రీజనల్ ఇన్చార్జిలతో వీడియో కాన్ఫరెన్స్, టెలి కాన్ఫిరెన్స్ వంటి వాటిని చేస్తున్నారు. దీని బట్టి చూస్తే చంద్రబాబును చూసి జగన్ ఇప్పుడిప్పుడే అన్ని నేర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: