- ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నిబంధన నుంచి మినహాయించాలని లేఖలో కోరిన రామచంద్రయాదవ్
- ఎపిలో చంద్రబాబు సర్కార్ పై రామచంద్రయాదవ్ ధ్వజం
- మిగతా రాష్ట్రాల కంటే ముందే టెట్ నిబంధనను అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం
- ఉపాధ్యాయుల అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకోకుండా టెట్ నిర్వహించడంపై సీరియస్
- చిత్తశుద్ది ఉంటే ఫీజులు నియంత్రించాలని సవాల్
- ఫీజుల నియంత్రణ పై లేని శ్రద్ద టీచర్లకు టెట్ నిర్వహణపై ఎందుకంటూ రామచంద్రయాదవ్ ఆగ్రహం
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నిబంధన నుంచి మినహాయించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ లేఖ రాశారు. విద్యాహక్కు చట్టం పేరుతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ లో అర్హత సాధించాలన్న నిబంధనను తొలగించాలని ఆయన ఆ లేఖలో కోరారు. అలాగే ఎపి ప్రభుత్వంపై రామచంద్రయాదవ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాసేలా ప్రేరేపిస్తున్నారన్నారు. టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇఫ్పటికే అనేక రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నాయన్నారు. దీంతో పాటు జాతీయ విద్యా మండలిని కూడా సంప్రదించాయన్నారు.
విద్యాహక్కు చట్టంలోని ఇతర అంశాల పట్ల శ్రద్ద చూపలేని ప్రభుత్వం... ఉపాధ్యాయుల టెట్ అర్హతపై మాత్రం ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్బంధ విద్య, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకోకోపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్ధాయిలో అమలు చేయాలంటే ఇతర అంశాల పట్ల కూడా అదే శ్రద్దను కనపరచాలన్నారు. కేవలం ఉపాధ్యాయుల విషయంలోనే చట్టాన్ని వినియోగించడం ఎంత వరకు సబబో సమాధానం చెప్పాలన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు తమ అభ్యర్ధనలను చెప్పుకుంటున్నా వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల అభ్యర్ధనలను ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టు ద్రుష్టికి ఎందుకు తీసుకెళ్లలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉపాధ్యాయులపై కక్షపూరిత ధోరణిని మార్చుకొని, టెట్ నిబంధనలు తొలగించడమో లేక సవరించడమో చేయాలని డిమాండ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి