జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది  మూడు పార్టీలకు  భవిష్యత్తును అందించే ఎన్నిక అని చెప్పవచ్చు. ఇక్కడ గెలుపు పైనే  పార్టీల ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఓడిన పార్టీ ఇక రాబోవు రోజుల్లో కాస్త వెనక్కి వస్తుందనే భావనతో ఈ ఎన్నికను నాయకులంతా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు.. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు క్యాండిడేట్ లు హోరా హోరీగా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ప్రచారం చేస్తున్నారు.. వీరికి సపోర్టుగా ఆయా పార్టీల అధిష్టానం మొత్తం జూబ్లీహిల్స్ లోనే తిష్ట వేసింది.. ఇదే సమయంలో ఈ ఉప ఎన్నిక రిజల్ట్ అనేది ఆయా పార్టీలకు ఒక గుణపాఠంలా చెప్పుకోవచ్చు.. అది ఎలాగో చూద్దాం.. 

జూబ్లీహిల్స్ లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇదే సమయంలో మేము 10 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ మాత్రమే ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకొస్తోంది. రోడ్లు వేసాము ఇండ్లు ఇచ్చాము అని బీఆర్ఎస్ చెప్పుకొస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది. బీఆర్ఎస్ పదేండ్లు ఉండి ఏమీ చేయలేదని, మేం అధికారంలోకి వచ్చి 150 కోట్లకు పై అభివృద్ధి పనులు చేశామని చెబుతోంది. మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తే జూబ్లీహిల్స్ ను మరింత డెవలప్ చేసి చూపిస్తామని  ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇక బిజెపి విషయానికి వస్తే జాతీయస్థాయిలో మేమున్నాం ఏ అభివృద్ధి కావాలన్నా మేం తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు.

 ఈ ప్రాంతంలో ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ వారు ప్రాధేయ పడుతున్నారు. ఈ విధంగా మూడు పార్టీలు వారి వారి విషయాలను ప్రజల ముందు ప్రదర్శిస్తున్నారు. ఇక ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఓటర్లు 10 సంవత్సరాల అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా? లేదంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీరికి ఈసారి ఛాన్స్ ఇద్దాం అభివృద్ధి చేసి చూపిస్తారు కావచ్చని నమ్ముతారా? అదేవిధంగా బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ వైపు ఓటర్లు చూస్తారా అనేది ఎన్నికల రిజల్ట్ తర్వాత బయటకు వస్తుంది.. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నిక అనేది ప్రతి పార్టీ నాయకునికి ఒక గుణపాఠంలా మారబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: