తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల కష్టాలు అన్ని తీరుతాయని భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న తీరుగా గత కేసీఆర్ పాలనలో నడిచింది.. ఉద్యోగులకు జీతాలు పెరిగాయి కానీ వారికి సంబంధించిన పెండింగ్ బకాయిలను అలాగే ఉంచుతూ వచ్చారు. దీనికి తోడు రాష్ట్రంలో తీవ్రమైన అప్పు ఉండడం వల్ల కనీస జీతాలే పడని పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృధా ఖర్చులు అన్నింటిని తగ్గించుకున్నారు. ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీ వరకే జీతాలు వేస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిలు కూడా పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు ఒక హామీ ఇచ్చి విడతల వారిగా డబ్బులు చెల్లిస్తామని చెప్పింది. అయితే తాజాగా వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని నిధులను విడుదల చేసింది. ఆ నిధులు ఎన్ని ఆ వివరాలు చూద్దాం.. తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పవచ్చు. వీరికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు 707.30 కోట్ల  నిధులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జారీ చేశారు. ప్రతి నెలా ఉద్యోగుల కోసం 700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగుల సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత  నవంబర్ నెలలో ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించింది.

ఈ బకాయిల్లో ముఖ్యంగా టీపీఎఫ్, గ్రాట్యూటీ, సలెండర్ లీవ్స్ అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ బిల్లులను చెల్లించడంతో ఏపీ సీఎం చంద్రబాబు పై కాస్త వేటు పడింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చెల్లించాలని చాలా రోజుల నుంచి వారు అడుగుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో ఈ బిల్లులు విడుదల కావడంతో ఈ వెయిట్ కాస్త చంద్రబాబు పై పడింది. ఆయన కూడా చెల్లించాలని అక్కడి ఉద్యోగ సంఘాలు తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మొత్తానికి గురువుకు శిష్యుడు  ఒక పంచ్ ఇచ్చాడని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: