ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది స్క్రబ్ టైఫస్ అనే పురుగు. ఏపీలో పెద్ద ఎత్తున స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవ్వడంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ చనిపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రజలు. గడిచిన రెండు రోజుల క్రితం విజయనగరం చీపురుపల్లి మండలంలో ఉన్నటువంటి మెట్టపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో మరణించింది. వైద్యులు లోతైన పరీక్ష చేయడం వల్ల ఈ మహిళ స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణించిందంటూ నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు , స్థానికులు ఆందోళన చెందుతున్నారు


వ్యాధి లక్షణాల విషయానికి వస్తే:
తీవ్రమైన జ్వరంతో పాటుగా , కుట్టినచోట నల్లటి చుక్కలాంటి గాయము అలాగే తీవ్రమైన అలసట, చలితో కూడిన వణుకు, శ్వాస కోస ఇబ్బందులు, దద్దుర్లు, వాంతులు, కడుపునొప్పి, విరోచనాలు, తీవ్రమైన నొప్పులు ఎదురవుతాయి.

కొన్నిసార్లు తీవ్రమైన దశలో అవయవాల వైఫల్యం (కిడ్నీ, లివర్ )వంటి వాటికి  సమస్యలు  ఎదురవుతాయి.


ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే రికవరీ అవ్వడం కష్టమని వైద్యులు తెలియజేస్తున్నారు


చాలామందికి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి పేరు తెలియకపోవడం వల్లే వీటిని గుర్తించలేకపోతున్నారని తెలియచేస్తున్నారు వైద్యులు. వైద్యులు తెలుపుతున్న ప్రకారం నేలపై ఉండే కొన్ని రకాల నల్లిని పోలినట్టు ఉండే పురుగు కాటేయడం వల్ల ఈ వ్యాధి మనిషికి సోకుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పొలాలలో పనిచేసే రైతులు, జంతువుల దగ్గర ఉండేవారు అటవీ ప్రాంతంలో తిరిగే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వీరందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.


ఇప్పటికే 26 జిల్లాలలో పాజిటివ్ కేసులు చాలానే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 380 కేసులు కాకినాడలో 140కి పైగా కేసులు నమోదు అవ్వగా విశాఖ 125 కేసులు బయటపడ్డాయి. రోజు రోజుకి జిల్లాల వారీగా కేసులు పెరిగి ఇప్పుడు మొత్తం మీద 1317 కు చేరాయి.


ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ అనేది కుట్టినప్పుడు ఆ కాటు వేసిన చోట చిన్న నల్లటి మచ్చగా కనిపిస్తుంది.


ఈ సూక్ష్మ కీటకాలు ఎక్కువగా గడ్డిపొలాలు, తడి నేలలు, చెత్త ఉన్న ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.


అలాగే అడవి జంతువులు, ఎలుకలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుందట.

స్క్రబ్ టైఫస్ బాధితులు వెంటనే చికిత్స తీసుకుంటే మరణాల రేటు 2 శాతం లోపే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: