ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ దందా బయటపడిందని జయచంద్రరెడ్డికి స్వయంగా చంద్రబాబు బీఫామ్ ఇచ్చారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు కూడా వీళ్లు పెట్టినవే ఏకంగా వాటికి పూజలు చేసి మరి కల్తీ మద్యం ఫ్యాక్టరీలను మొదలు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. వీరు తయారు చేసిన కల్తీ మద్యం బాటిల్ల మీద లేబుల్స్ కూడా వీళ్లే వేస్తున్నారు. వాళ్లే బెల్టు షాపులలో, లిక్కర్ షాపులలో ఏపీ అంతట అమ్ముతున్నారు.. ఇదంతా కూడా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే నడిపించారంటూ ఫైర్ అయ్యారు. ఇంత చేసిన జయచంద్రారెడ్డి అతని అనుచరులను అరెస్టు చేయలేదు.
కేవలం వైసీపీ నేతలను మాత్రమే అరెస్టు చేశారంటూ ఫైర్ అయ్యారు. జోగి రమేష్ ను అన్యాయంగా జైల్లో పెట్టారు తప్పుడు వాంగ్మూలాలు సాక్షాలను సృష్టించాలని చూస్తున్నారని , పిన్నెల్లి సోదరులపైన ఇలాగే అక్రమ కేసులు పెట్టారని టిడిపి వాళ్ళే హత్య చేసుకుంటే వైసిపి వాళ్ళని ఇరికించారు.. గ్రూప్ తగాదాల వల్లే హత్య జరిగిందని ఎస్పీనే ట్వీట్ చేశారని తెలిపారు. మా పార్టీ నాయకుడైన కొండారెడ్డి పైన అక్రమ గంజాయి కేసు పెట్టారు.. కానీ ఆయన బైకుకు పెట్టిన జిపిఎస్ ట్రాక్ వల్లే పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు రెడ్ బుక్ నే ఫాలో అయితే ఎలా? అంటు నిలదీశారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధిస్తున్నారు. అలాగే మిథున్ రెడ్డి బెయిల్ సమయంలో కూడా జడ్జి ఆశ్చర్యపోయేలా చేశారని, వైసిపి హయాంలో పనిచేసిన అధికారులందరినీ కూడా అరెస్టు చేస్తున్నారని చివరికి ప్రశ్నించిన జర్నలిస్టుల పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. వారి పార్టీలో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ చేసిన పనికి ఎటువంటి చలనం ప్రభుత్వంలో పోలీసులలో కనిపించలేదు. కానీ వార్త రాసిన విలేకరిపైన కేసు పెట్టారంటూ ఫైర్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి