వైసీపీ పార్టీ అధినేత తన సొంత జిల్లా అయిన కడపలో మరో ఎన్నిక రాబోతుంది. అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక. ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈనెల 11వ తేదీన కొత్త మేయర్ ఎన్నుకోబోతున్నారు.  కొన్ని అవినీతి ఆరోపణల  నేపథ్యంలో వైసీపీ తరఫున ఎన్నికైన మేయర్ సురేష్ బాబును తొలగించారు. దీంతో కొత్త మేయర్ ఎన్నిక ఇప్పుడు అనివార్యంగా మారింది. ఏవేవో అకారణాలు చెప్పి మేయర్ పదవి నుంచి తొలగించారని ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈనెల 9వ తేదీన విచారణ తో క్లారిటీ రాబోతోంది.


అయితే కొత్త మేయర్ గా ఎవరు ఎన్నికయినప్పటికీ  పదవి కాలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ కూడా కడప మేయర్ పీఠాన్ని దక్కించుకొని వైసీపీ పార్టీని దెబ్బ కొట్టాలని టిడిపి సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ కొత్త మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప కార్పొరేషన్ బలాల విషయానికి వస్తే.. మొత్తం 50 వార్డులకు గాను వైసీపీ 48, టిడిపి 1, జనసేన 1 బలం ఉన్నది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొంతమంది కార్పొరేటర్లు కూటమిలో చేరారని వినిపిస్తున్నాయి.

దీనివల్ల బలాలలో కొంత మార్పు వచ్చిందని.. సుధీర్ బాబుని దించేసి కూటమి తరఫున టిడిపి మేయర్ స్థానం సంపాదించాలంటే 26 మంది సభ్యులు బలంగా ఉండాలి. కడప చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మెంబర్స్ తో పాటుగా వైసీపీ నుంచి వచ్చే కార్పొరేటర్ల మీద కూడా కూటమి ప్రభుత్వం ధీమాగా ఉన్నది. నగర అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నారు. దీంతో ఈసారి కడప మేయర్ ఎన్నికలు మరింత ఉత్కంఠంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: