ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగైనా సాధించాలని ప్రయత్నించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే వారిలో చాలా మంది అర మార్కుతో ఉద్యోగం రాలేదని, ఒక మార్కుతో జాబ్ పొందే అవకాశం కోల్పోయామని చెబుతూ ఉంటారు. సమాజంలో ప్రతిరోజూ ఇలా చెప్పే వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. ఓడిపోయిన ప్రతిఒక్కరూ తమను తాము సమర్థించుకోవడానికి ఇలాంటి కారణాలు చెబుతూ ఉంటారు. 


 
కానీ అలా అర మార్కు, ఒక మార్కుతో జాబ్ పొందే అవకాశాన్ని కోల్పోయినవారు ఓటమికి కారణాలు వెతుక్కోకుండా... మరోసారి అదే ఫలితం పునరావృతం కాకుండా ప్రయత్నం చేయాలి. జీవితంలోని చాలా విషయాల్లో అసాధ్యానికి సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నమే అని గుర్తుంచుకోవాలి. శ్రమతో, పట్టుదలతో లక్ష్యం కోసం కృషి చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలమని విశ్వసించాలి. 
 


మనపై మనకే నమ్మకం లేకుండా ప్రయత్నం చేస్తే మాత్రం నిరాశజనకమైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పని గురించైనా, లక్ష్యం గురించైనా మొదలు పెట్టే ముందు ఆలోచించాలి. అవసరమైతే పెద్దల, సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. పని లేదా లక్ష్యం కోసం 100 శాతం శ్రమిస్తామని నమ్మకం ఉంటే మాత్రమే ముందడుగు వేయాలి. ఏ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉంటుందో ఆ రంగంలోనే సక్సెస్ కావడనికి ప్రయత్నం చేయాలి. 


 
తల్లిదండ్రుల కోసం, స్నేహితుల కోసం ఇష్టంలేని రంగాన్ని ఎంచుకున్నా వ్యతిరేక ఫలితాలే వస్తాయి. నచ్చిన రంగాన్ని ఎంచుకుని శ్రమిస్తూ గట్టి ప్రయత్నం చేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో మొదటి ప్రయత్నంలో విజయం దక్కకపోవచ్చు. అలాంటి సమయంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా అంతకు ముందు ప్రయత్నంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందడుగులు వేస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: