ఈరోజు కూడా ఇండియా హెరాల్డ్ మీ కోసం ఒక మంచి మాట ను మీ ముందుకు  తీసుకొచ్చింది. ఆ మంచి మాట ఏమిటంటే..?ఓపికతో ఉండేవారు ఎప్పుడు ఓడిపోరు.. ఓపిక పట్టి చూడు.. జీవితం చాలా నేర్పుతుంది.. దీని అర్థం.. ఏ విషయంలోనైనా సరే మనం ఓపికగా ఉండాలి.. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.. అప్పుడే మనం దేన్ని అయినా సాధించగలుగుతాము.. ఓపిక పట్టి నంత కాలం జీవితంలో విజయం సాధిస్తే తప్పా పరాజయాన్ని  చవి చూసే అవకాశం లేదు . అంతేకాకుండా  జీవితం మనకు చాలా నేర్పుతుంది. అని దీని వివరణ..


ఉదాహరణకు మీరు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు,  వెంటవెంటనే సాధించాలంటే అది కుదరదు.. ఎంతో ఓపిక ఉండాలి.ఎంతోకాలం శ్రమించాలి. అప్పుడే మనం అనుకున్న దానిని సాధించగలుగుతాము.  అయితే అనుకున్న దానిని సాధించే సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. మంచి ఏదో,చెడు ఏదో తెలుసుకునే సమయం కూడా అప్పుడే.. కాబట్టి ఎప్పుడు ఎలా ఉండాలో కూడా జీవితం మనకు నేర్పిస్తుంది..


అంతేకాదు  జీవితం మనకు చాలా నేర్పుతుంది.  ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమయంలో మౌనంగా ఉండాలి, ఏ సమయంలో మాట్లాడాలి అలాగే ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించింది అంటే అది మనం జీవితంలో పాటించక తప్పదు.. జీవితం అనేది ఒక సముద్రం లాంటిది.. సముద్రం ఎన్నో అలల తాకిడిని తట్టుకొని, ఎన్నో కష్టాలను, నష్టాలను, ఎన్నో జీవరాశులను తనలో దాచుకుంటుంది.. మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయబ్రాంతులకు లోనవ్వకుండా ఉండాలి.


అంతే కాకుండా ఏదైనా మంచి కోసం ఎదురు చూస్తున్నప్పుడు తప్పకుండా ఓపిక పట్టాలి.. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి నేస్తమా.. ఏదైనా సాధించాలి అనుకుంటే ఓపిక పట్టి చూడు.. ఎప్పుడు ఓడిపోవు.  ఓపిక గా ఉంటే జీవితం ఎన్నో నేర్పిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: